పవర్ స్టార్ వపన్ కళ్యణ్ ప్రస్తుతం తెలగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాడు. తను రాజకీయంగా పార్టీని బలోపేతం చేస్తున్నట్టు..తాజాగా తిరుపతిలోని ఇందిరా మైదానంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో చెప్పుకు వచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ రావాలనేది పవన్ కళ్యాణ్ నిర్ణయంగా తెలుస్తుంది. అందుకు తగినవిధంగా జనసేన పార్టీ పనిచేస్తుందని, స్పెషల్ స్టేటస్ ని సాధిస్తుందని చెప్పుకువచ్చారు.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తన అభిమానులని ఉద్ధేశించి  కూడ అదే వేధికలో ప్రసంగించారు. తనకి సినిమాలపై, రాజకీయాలపై, పదవులపై వ్యామోహం లేదని దేశం, సమాజం పై వ్యధ, వ్యామోహం, బాధ్యత ఉన్నాయని అన్నారు. అభిమాని వినోద్ రాయ్ హత్య తనని బాధించిందని చెప్పుకువచ్చారు. ముఖ్యంగా ఇతర హీరోలతో తనకి ఎటువంటి విభేధాలు లేవని చెప్పుకువచ్చారు.

అందరూ ఒక్కటేనని చెప్పుకువచ్చారు. నిజానికి అభిమాని వినోద్ రాయల్ హత్య వెనుక జూనియర్ అభిమానులు ఉన్నారని బయటకు వినిపిస్తున్న సమాచారం. నిజానికి ఇందులో ఏ మాత్రం నిజంలేదని తెలిసింది. జరిగింది క్షణికావేశంలో జరిగిన హత్య అని పోలీసులు సైతం చెప్పకువచ్చారు. అయితే జూనియర్ తో తను ఎటువంటి గొడవలు లేవని చెప్పుకురావటం ఇక్కడ విశేషం.

ఇక తిరుపతిలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ పలు అంశాల గురించి ప్రస్తావించారు. ప్రతి అంశం ప్రజలను ఎంతగానో ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ ఎంచుకున్న విధానం బాగుందని ప్రజలు నుండి తనకి మధ్ధతు లభించటం ఇక్కడ విశేషం. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కి సైతం వినోద్ రాయల్ మరణం వార్త పై సానుకూల అంశాలు తోడవటంతో...తన అప్ కమింగ్ రిలీజ్ కి సిద్ధం అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: