పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా జరిపిన తిరుపతి బహిరంగ సమావేశంలో తను ఇచ్చిన స్పీచ్ అటు ఇండస్ట్రీలోని పెద్దలను, ఇటు రాజకీయనాకులను తెగ చర్చించుకునే విధంగా చేసింది. అయితే పవన్ కళ్యాణ్ స్పీచ్ ఉద్ధేశం ఏపి కి ప్రత్యేక హోదా కావాలనేది తెలిసింది. ఇందుకు రాష్ట్ర అధికార ప్రభుత్వం, ఇతర ప్రతి ప్రక్షాలు  ఏ మాత్రం ఫైట్ చేయలేకపోతున్నాయని చెప్పుకొచ్చారు.


అందరూ అధికారం కోసం ప్రాకులాడుతున్నారు తప్పితే...వ్యక్తిగత ప్రయోజనాలను వదులుకొని ప్రత్యేక హోదా కోసం ఎవ్వరూ ప్రయత్నించటం లేదని చెప్పుకొచ్చారు. నేషనల్ పాలిటిక్స్ లో తెలుగు వారికి అంత సీన్ లేదని చెప్పకనే చెప్పారు. తెలుగు ఎంపిలు దండగ అంటూ డైరెక్ట్ గానే పలు కామెంట్స్ చేశారు. అయితే తెలుగు ఎంపిలకి భాషాతో సమస్యలు ఉన్నాయని..కాస్త ఇంగ్లీష్, కాస్త హిందీ నేర్చుకోవాలని కితాబు ఇచ్చారు.


ఇక హందీ విషయానికి వస్తే..గతంలో మెగాస్టార్ చిరంజీవి ఎంపీ గా ఉన్నప్పుడు నేషల్ ప్రెస్ మీట్ లో హిందీలో మాట్లాడుతూ విఫలమయ్యాడు. తనకు హందీ రాదని..త్వరలోనే మంచిగా నేర్చుకొని మీ ముందుకు వస్తానని అందులో చెప్పటం విశేషం. ఇది ఇండైరెక్ట్ గా అన్నకి పడిన కౌంటర్ అని అందరూ భావిస్తున్నారు. అలాగే ప్రజారాజ్యం పార్టీని సైతం కాంగ్రేస్ పార్టీలో విలీనం చేయటంపై కూడ ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసుకొని వచ్చారు.


సోనియా ముందు అందరూ అడుక్కునే వాళ్ళే అంటూ ఎంపీలను పదే పదే కామెంట్ చేయటంతో సభ రసవత్తరంగా మారింది. సభకి వచ్చిన ప్రజలు,అభిమానులు ఆధ్యంతం పవన్ కళ్యాణ్ చేస్తున్న స్పీచ్ ని అర్ధం చేసుకుంటూ..తన స్పీచ్ తో ట్రావెల్ చేయటం జరిగిందని అంటున్నారు. మొత్తంగా ఎంపీలపై పవన్ కళ్యాణ్ చేసిన ఘూటు వాఖ్యలు అన్నకి కూడ గుచ్చుకొని ఉంటాయని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: