పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన మూవీ సర్ధార్ గబ్భర్ సింగ్. ఈమూవీకి సంబంధించిన రిలీజ్ సమయంలో దీనిపై ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. గబ్భర్ సింగ్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న మూవీపై ఇండస్ట్రీలోనూ, మార్కెట్ లోనూ భారీ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొన్నాయి. మార్కెట్ వర్గాల్లోనూ ఈ మూవీ భారీ బిజినెస్ ని చేజిక్కించుకుంది.


అందులోనూ గబ్భర్ సింగ్ మూవీ రీలీజ్ తరువాత దాదాపు 2 సంవత్సరాల గ్యాప్ తీసుకొని పూర్తి హీరోగా వస్తున్న చిత్రం సర్ధార్ గబ్భర్ సింగ్ కావటంతో.. కలెక్షన్స్ పరంగానూ ఈ మూవీ భారీ సక్సెస్ ని అందుకుంటుందని అందరూ అభిప్రాయ పడ్డారు. ఇక సర్ధార్ గబ్భర్ సింగ్ మూవీకి డైరెక్టర్ అనేది స్వయంగా పవన్ కళ్యాణ్ కావటం అనేది విశేషం. అంటే ఈ మూవీకి డైరెక్టర్ బాబీ అయినప్పటికీ...తెర వెనుక నడిపించింది అంతా పవన్ కళ్యాణ్ అనేది ఇండస్ట్రీకి తెలిసిన ఓపెన్ సీక్రెట్.


అందుకే సర్ధార్ గబ్భర్ సింగ్ మూవీ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ అంటూ రిలీజ్ కి ముందు నుండి ఇది ఈ మూవీకి ప్రమోషన్ గా బాగా ఉపయోగపడింది. ఇదిలాఉంటే ఈ మూవీ రిలీజ్ అనంతరం మొదటి షోకే యావరేజ్ అంటూ టాక్స్ బయటకు వచ్చాయి. ఈ ఎఫెక్ట్ బాక్సాపీస్ పై పడింది. గబ్భర్ సింగ్ వచ్చినంత పెద్ద సక్సెస్ సర్ధార్ గబ్భర్ సింగ్ మూవీకి రాలేదనేది స్పష్టంగా తెలుస్తుంది.


ఈ విషయాన్నే పవన్ కళ్యాణ్..తిరుపతి బహిరంగ సభలో స్పష్టం చేశారు. నేను పార్టీని నడపాలన్నా అందుకు మనీకావాలి. అందుకే సినిమాలు చేస్తా...రాజకీయాలు చేస్తా..అంటూ చెప్పుకొచ్చాడు. మరి నా సినిమాలకి డబ్బులు కావాలంటే మీరు నా సినిమాలను చూడాలి...ఎక్కువ టికెట్స్ కొనాలి. సర్ధార్ గబ్భర్ సింగ్ ని అంతగా చూసినట్టు లేరు. నాకు డబ్బులు ఎక్కువుగా రాలేదు..అంటూ అసలు నిజం చెప్పుకురావటం ఇక్కడ అభిమానులని ఆశ్చర్యపరిచింది.



మరింత సమాచారం తెలుసుకోండి: