కమెడియన్ గా ఫిల్మ్ కెరీర్ ని స్టార్ చేసిన సునీల్, తరువాత హీరోగా అవతారం ఎత్తి వరస సక్సెస్ లను చూస్తున్నారు. ఇప్పటి వరకూ సునీల్ నటించిన సినిమాలలో 80 శాతం సక్సెస్ రేటు ఉంది. నిర్మాతలు సైతం సునీల్ మార్కెట్ పై పాజిటివ్ గా ఉన్నారు. దీంతో సునీల్ కి వరుస సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సునీల్ నటించిన జక్కన్న సినిమా నిర్మాతకి చెప్పుకోదగ్గ లాభాలను మిగిల్చాయని అంటున్నారు.


అయితే ప్రస్తుతం సునీల్ తన అప్ కమింగ్ మూవీల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలోనటించిన సినిమాల కంటే మంచి కథలను ఎంచుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఇక సునీల్ తాజాగా ఓ రిమేక్ మూవీ చేయనున్నారనే విషయం బయటకు వచ్చింది. '2 కంట్రీస్' రీమేక్ ని సునీల్ చేస్తున్నారంటూ ఇండస్ట్రీ నుండి టాక్స్ బయటకు వస్తున్నాయి.


గతంలో ఈ సినిమాను హీరో వెంకటేశ్, రామ్ చేయనున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమా మలయాళం మాతృక చూసినప్పుడు దీని రీమేక్ లో తాను చేస్తే బాగుంటుందని సునీల్ గతంలోనే  అనుకున్నారంట. కానీ ఈ మూవీ వెంకటేష్, రామ్ కాంబినేషన్ లో రానుందని తెలియటంతో సునీల్ కొంత నిరాశ చెందాడు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ సునీల్ ని వరించింది.


ఈ రిమేక్ సునీల్ కి మొదటి సారి కాదు. మలయాళంలో దిలీప్ హీరోగా చేసిన 'పందిప్పడు' సినిమాని సునీల్ రిమేక్ చేసి 'పూలరంగడు' గా తీసుకువచ్చడు. ఇప్పుడు మలయాళ రిమేక్ లో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, తమిళంలోని మరో రిమేక్ మూవీని సునీల్ చేయనున్నాడని అంటున్నారు. తాజాగా సునీల్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ కామెడీ ఫిల్మ్ ని చూసి,దాన్ని రిమేక్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈ మూవీలో సునీల్ సైతం భాగస్వామ్య పెట్టుబడులను పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాడని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: