గ‌త కొద్ది రోజుల క్రితంగా తెలుగు సినీమా హీరోల అభిమానుల‌పై విప‌రీతమైన చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి విదిత‌మే. ఇందుకు కార‌ణం కూడా అంద‌రికి తెలిసిందే. ఆప్ కోర్స్..  ఈ క్ర‌మంలో మ‌రోసారి గుర్తు చేయ‌క త‌ప్ప‌దు. క‌ర్నాట‌క ఓ ప్రాంతంలో స్వ‌చ్చంధ సంస్ధ అవ‌యవ‌ధానం కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ అభిమానులు, జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గోన్నారు. అయితే ఈ క్ర‌మంలో వీరువురి మ‌ధ్య తీవ్ర గోడ‌వ‌కు దారి తీసింది. మా హీరో గొప్ప అంటే మా  హీరో గొప్ప అంటూ ఇరువురి మ‌ధ్య ఊహించ‌నంత స్థాయిలో గొడ‌వ జ‌రిగింది. ఈ క్ర‌మంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమాని అక్ష‌య్ కుమార్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమాని వినోద్ రాయ‌ల్ పై క‌త్తి తో దాడికి దిగారు.

వినోద్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ప‌వ‌న్...

దీంతో వినోద్ రాయల్ ఒక్క‌సారి గా కుప్ప‌కూలి పోయాడు. వెంట‌నే హ‌స్పిటల్ త‌ర‌లించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో క‌ల‌త చెందిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెంట‌నే తిరుపతి లో వినోద్ రాయ‌ల్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. ఈ క్ర‌మంలో  ప‌వ‌న్ త‌న అభిమానుల‌కు కొన్ని సూచ‌న‌లు కూడా చేశారు. అభిమానం ఉండాలి కానీ... ప్రాణాల మీదకు తీసుకొనేలా ఉండ‌కూద‌ని పిలుపు నిచ్చారు. ఇలా అభిమానుల‌కు కొన్ని స‌ల‌హాలు ఇచ్చారు. అంతే కాకుండా వారి కుటుంబానికి అడంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. అయితే ఈ ఇష్యూ కార‌ణ‌మైన  ఎన్టీఆర్ అభిమాని అక్ష‌య్ కుమార్ ను క‌ర్ణాట‌క పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఈ విష‌యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు కానీ... తాజాగా అభిమానుల‌పై త‌న అభిప్రాయాన్ని స్ప‌ష్టం చేశారు.

మితి మీరిన అభిమానం మంచిది కాద‌న్న ఎన్టీఆర్...

మితి మీరిన‌ అభిమానం ఎప్పుడూ మంచిది కాద‌ని త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మ‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ అన్నాడు. ఓ టీవి చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ ఓ ఆయ‌న స్పందించారు. వేటి వ‌ల్ల అభిమానం  మితిమీరుతుందో కూడా చెప్పారు. ఆయ‌న మాట‌లోనే... ముందుగా... నువ్వు పుట్టిన దేశాన్ని ప్రేమించు... నిన్ను కన్న తల్లిదండ్రుల‌ను ప్రేమించు... నీ మీద న‌మ్మ‌కం పెట్టుకున్న నీ భార్య‌ను ప్రేమించు...నిన్నే నమ్ముకుని పుట్టిన నీ పిల్ల‌ల‌ను ప్రేమించు.. ఆ త‌రువాత నీ అభిమానుల‌నేవారిని ప్రేమించు. క్రాస్ రోడ్స్ లో నిల‌బ‌డాల్సి వ‌స్తే క‌నుక... దేశం, త‌ల్లి దండ్రులు, భార్యా పిల్ల‌లు, నిన్ను ప్రేమించిన శ్రేయోబిలాషుల వైపు వెళ్లిన త‌రువాత‌.. ఆఖ‌రికి నీ అభిమాన న‌టుల వైపు వెళ్లాలి. అని అన్నారు.

అలాగైతే నాకు అభిమానులు వ‌ద్ద‌న్న ఎన్టీఆర్...

అయితే ఈ విష‌యాల‌న్నీ కేవ‌లం నా అభిమానుల‌కే కాదన్న ఎన్టీఆర్...అంద‌రి అభిమానుల‌కు చెబుతునానన్నారు. అభిమాన‌మ‌నేది సినీమాల వ‌రకు. రెండు గంట‌లు చూసే సినిమా కోసం గొడ‌వ‌ల‌కు దిగొద్ద‌ని నేను అంద‌రినీ కోరుకుంటున్నాన‌న్నారు. అయితే... నా అభిమానులు  గొడ‌వ‌ల వైపు వెళ్ల‌ర‌నే న‌మ్మ‌కం ఖ‌చ్చితంగా నాకు ఉంది. ఒక‌వేళ‌... గొడ‌వ‌ల‌కు వెళ్లేట‌ట్ల‌యితే, ద‌యచేసి నా అభిమానులుగా ఉండొద్ద‌ని కోరుకుంటున్నాను. అని అన్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్. అయితే ఇక్క‌డ ఎన్టీఆర్ ఇచ్చిన సూచ‌న‌లు బాగానే ఉన్నా... ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారోన‌న్న అనుమానం క‌లగ‌క మాన‌దు. కేవలం ప్రెస్ మీట్ లోనే త‌మ అభిమానుల‌కు స‌ల‌హాలు ఇచ్చేసి ఊరుకుంటే స‌రిపోదు... ఇందుకు వారు ఆయా అభిమానుల‌కు స‌రైన దిక్సూచి ఇచ్చేలా వారి కార్య‌క్ర‌మాలు ఉంటే బాగుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: