యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమాలతోనే కాదు టైటిల్స్ తో కూడా సంచలనాలను క్రియేట్ చేస్తాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్లో జనతా గ్యారేజ్ రిలీజ్ కు రెడీ అవుతున్న తారక్ ఎన్నాళ్లనుండో తనతో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్న వక్కంతం వంశీ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా టైటిల్ గా దడ్కన్ అని పెట్టబోతున్నారట.


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కు ఎప్పటినుండో తన క్రేజ్ కు తగ్గట్టు కథలందిస్తూ వస్తున్న వక్కంతం వంశీ ఇప్పుడు ఏకంగా తారక్ ను డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. దాదాపు రెండేళ్ల నుండి వంశీ ఈ ఆఫర్ కోసం చూస్తున్నా జూనియర్ అవకాశమివ్వలేదు. అయితే ఫైనల్ గా దడ్కన్ కు ఆ ఛాన్స్ దక్కించుకున్నాడు వక్కంత వంశీ. 


ఎన్.టి.ఆర్ తో కాకుండా వేరే హీరోల సినిమా ఆఫర్లను వచ్చినా ముందు తారక్ తో తీశాకే వేరే హీరో అని అలానే వెయిట్ చేసిన వక్కంతం వంశీ ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని ఓ బ్లాక్ బస్టర్ హిట్ గా మలిచే సినిమాగా రాబోతున్నాడు. టైటిల్ కూడా కొత్తగా అభిమానులను ఖుషి చేసేలా ఉంది. ప్రస్తుతం జనతా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న జూనియర్ ఈ సినిమా టైటిల్ పై వస్తున్న ఫీడ్ బ్యాక్ కు సంతోషంగా ఉన్నాడట.


అంతేకాదు గ్యారేజ్ తనకు చాలా ప్రెస్టిజియస్ సినిమాగా భావిస్తున్న ఎన్.టి.ఆర్ సినిమాతో సంచలన రికార్డులు క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే సినిమా ఫలితం పట్ల చిత్రయూనిట్ అంతా నమ్మకంతో ఉన్నారు. కథా బలమున్న సినిమాలతో స్టార్ సినిమాలకు కొత్త వన్నె తెస్తున్న కొరటాల శివ జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అనేస్తున్నారు.


మరి అభిమానుల అంచనాలను ఈ సినిమా ఏవిధంగా అందుకోనుందో మరో నాలుగు రోజులు ఆగితే తెలుస్తుంది. సెప్టెంబర్ 1న భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న జనతా గ్యారేజ్ మరోసారి ఎన్.టి. ఆర్ స్టామినా తెలియ చేసేలా ఉంటుందని అంటున్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: