‘జనతా గ్యారేజ్’ విడుదల కోసం ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు జూనియర్ ఈ సినిమా విడుదల తరువాత నటించబోయే సినిమాకు సంబంధించి వస్తున్న లేటెస్ట్ వార్తలు జూనియర్ అభిమానులకు టెన్షన్ పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  జూనియర్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో అక్టోబర్ నుండి మొదలు పెట్టబోయే లేటెస్ట్ మూవీకి ‘దడ్కన్’ అనే టైటిల్ నిర్ణయించడమే కాకుండా ఆ టైటిల్ రిజిస్టర్ చేయించారు అన్న వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలు ఇలా బయటకు వచ్చిన వెంటనే ఆ టైటిల్ పేరు విని జూనియర్ అభిమానులు షాక్ అయినట్లు టాక్.  సామాన్య ప్రేక్షకులకు ఏ మాత్రం అర్ధంకాని ఇటువంటి టైటిల్ తో తీసే సినిమాలో నటించ వద్దు అని అంటూ అప్పుడే జూనియర్ కు వందలాది మెసేజ్ లు వెళ్ళిపోతున్నాయని ఫిలింనగర్  టాక్.

‘దడ్కన్’ అంటే హిందీలో హృదయ స్పందన అని అర్థం. అక్షయ్ కుమార్-సునీల్ శెట్టి, శిల్పాశెట్టి ప్రధాన పాత్రల్లో గతంలో బాలీవుడ్ లో ఈ పేరుతో ఈసినిమా వచ్చింది. బాలీవుడ్ సినిమా టైటిల్స్ తో తెలుగులో సినిమాలు తీసే సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉన్నా ఇలా అర్ధం కాని టైటిల్స్ తో జూనియర్ పై ప్రయోగాలు ఏమిటి అని జూనియర్ అభిమానులు గగ్గోలు పెడుతున్నట్లు టాక్.

అయితే ఇటువంటి టైటిల్ పై జూనియర్ అభిమానుల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి  నిర్మాత కళ్యాణ్ రామ్ కేవలం ఒక ప్రయోగాత్మకంగా మాత్రమే అభిమానుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి ఈ టైటిల్ లీక్ చేసారని ఈ టైటిల్ ఫైనల్ కాదు అన్న ప్రచారం కూడ ఉంది.  ‘జనతా గ్యారేజ్’ తరువాత జూనియర్ కు పెరిగిన మార్కెట్ ను పూర్తిగా వినియోగించు కోవడానికి కళ్యాణ్ రామ్ జూనియర్ తో తానే సొంతంగా సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే.

అయితే రచయితగా మాత్రమే పేరు ఉన్న వక్కంతం వంశీకి దర్శకుడుగా  జూనియర్ అవకాశం ఇవ్వడమే ఒక సాహసం అని అనుకుంటున్న నేపధ్యంలో ఇలాంటి విచిత్ర టైటిల్స్ ప్రయోగాలు తమకు వద్దు అంటూ జూనియర్ అభిమానులు రంగంలోకి దిగిన నేపధ్యంలో తారక్ నిర్ణయాలు మారే అవకాశం ఉంది.  

దీనికితోడు నిన్న ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ మాట్లాడుతూ తాను అందరి హీరోలతోను నటించడానికి రెడీగా ఉన్నాను అని సంకేతాలు ఇచ్చిన నేపధ్యంలో త్వరలో జూనియర్ నుంచి మల్టీ స్టారర్స్  రాబోతున్నాయి అన్న ఊహలు కలుగుతున్నాయి.  మరి రాబోయే మల్టీ స్టారర్లలో జూనియర్ బాలయ్యల మల్టీ స్టారర్ ఉంటుందో లేదో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: