పవన్ మొన్న జరిగిన తిరుపతి పబ్లిక్ మీటింగ్ లో తన భార్య అన్నా కూతురు గురించి మాట్లాడి తన వారసుడు అకిరానందన్ ఆద్య ల గురించి మాట్లాడకపోయినా రేణు దేశాయ్ మాత్రం అవకాశం దొరికితే చాలు ఏదోవిధంగా తన ట్విటర్ లో పవన్ ప్రస్తావన తీసుకు వస్తూనే ఉంటుంది.  సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు జరగబోతున్న నేపధ్యంలో పవన్ అభిమానులకు జోష్ కలిగించేలా రేణు మరో కొత్త అంశాన్ని వెలుగులోకి తీసుకు వచ్చింది.

కొద్ది రోజులలో రాబోతున్న పవన్ పుట్టినరోజు వేడుకలను రేణుదేశాయ్ సోషల్ మీడియాలో చాల విభిన్నంగా మొదలు పెట్టింది.    తాను 2010లో తీసిన ఓ ఫొటోని తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఫ్యాన్సంతా ఈ ఫొటోని కామన్ డీపీగా పెట్టేసుకోవచ్చని సూచన చేసింది. 

ఈ సూచనతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.  అంతేకాదు ఆ ఫొటోని చాలామంది పవన్ ఫ్యాన్స్ ఇప్పటికే డీపీగా పెట్టుకోవడం మొదలు పెట్టేసారు. అంతేకాదు ఈ ఫోటోలోని పవన్ కళ్ళ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది రేణు దేశాయ్.

తాను పవన్ కళ్యాణ్ తో కలిసి ఉన్నప్పుడు ఎన్నో ఫోటోలు తీసినా ‘పవన్ గారి కళ్లల్లో ఇంటెన్సిటీని బయటికి చెబుతున్న ఈ ఫొటో అంటే నాకు చాలా ఇష్టం. 2010లో నేను కొన్ని నికాన్ డి5 కెమెరాతో క్లిక్ చేసిన ఫోటోలలో ఈ ఫోటో నాకెంతో ఇష్టం. ఈ ఫోటోలోని స్కిన్ టోన్ కూడా సహజమైనదే. నేనేమీ మార్చింది కాదు’ అంటూ రేణు పవన్ కళ్ళలోని తీక్షణమైన భావాల వెనుక అర్ధాలను వివరించడానికి ప్రయత్నించింది.

గత పుట్టినరోజుకు కూడ పవన్ ఫోటోలలో తనకు ఇష్టమైన మరో ఫోటోను ఇలాగే అభిమానులకు షేర్ చేసింది. ఇప్పుడు లేటెస్ట్ గా పవన్ లుక్స్ పై కామెంట్స్ ఇస్తూ రేణు షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అంతేకాదు పవన్ అభిమానులు అంతా ఈఫోతోను ఒకరికొకరు షేర్ చేసుకుంటూ పవన్ పుట్టినరోజు వేడుకల హంగామాను చాల ముందుగానే మొదలు పెట్టేసారు.  ఇది ఇలా ఉండగా నిన్న ఒక ప్రముఖ ఛానల్ ప్రసారం చేసిన ‘పవనిజం’ సినిమాకు మంచి రేటింగ్స్ వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా వచ్చే ఆదివారం ఈ టివి ఛానల్ లో ప్రసారం కాబోయే ‘ఇష్క్ వాలా లవ్’ మూవీలో అకిరానందన్ ఎలా కనిపించబోతాడో అన్న అంచనాలలో పవన్ అభిమానులు మంచి జోష్ పై ఉన్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: