మరికొద్ది రోజుల్లో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో థియోటర్స్ వద్ద హల్ చల్ చేయబోతున్న మూవీ 'జనతా గ్యారేజ్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ 'జనతా గ్యారేజ్' పై అభిమానులు తెగ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో యంగ్ టైగర్ అద్భుతంగా నటించాడని, అలాగే యాక్షన్ సైతం అద్భుతంగా చేశాడని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీపై మెగాస్టార్ చిరంజీవి సైతం రెస్పాండ్ అయ్యాడని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్.


ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం, మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' మూవీ థియోట్రికల్ చూశాడని అంటున్నారు. అలాగే ఈ మూవీకి సంబంధించిన మరికొన్ని క్లిప్స్ ని సైతం చూశాడని తెలుస్తుంది. దీంతో డైరెక్టర్ కొరటాల శివ మేకింగ్ స్టైల్ కి మెగాస్టార్ ఫిధా అయినట్టుగా తెలుస్తుంది. ఇక 'జనతా గ్యారేజ్' విజువల్స్ ని చూసిన చిరు...ఏ మాత్రం తన సంతోషాన్ని ఆపుకోలేక జూనియర్ కి సైతం తన కంగ్రాట్స్ చెప్పాడనే టాక్స్ బయటకు వస్తున్నాయి.


అయితే మెగాస్టార్ 'జనతా గ్యారేజ్' మూవీ క్లిప్సింగ్స్ ని చూడటానికి కారణం...చిరు నటించబోయే 151వ చిత్రానికి డైరెక్టర్ గా కొరటాల శివ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేసిన 'జనతా గ్యారేజ్' ని చూడాలని చిరుకి అనిపించింది. కొరటాల శివతో కొన్ని క్లిప్లింగ్స్ ని తెప్పించుకొని చూశాడనే ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం.


అన్నీ సక్రమంగా జరిగితే...చిరంజీవి 151వ చిత్రానికి డైరెక్టర్ గా కొరటాల శివ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక 'జనతా గ్యారేజ్' మూవీ సెప్టెంబర్ 1వ తేదీన భారీగా విడుదల అవుతుంది. భారీ అంచనాలతో వస్తోన్న ఈ సినిమా అభిమానులని సైతం సంతోషపరుస్తుందనేది చిత్ర యూనిట్ నుండి వినిపిస్తున్న టాక్స్.



మరింత సమాచారం తెలుసుకోండి: