మరొక మూడు రోజులలో విడుదల కాబోతున్న ‘జనతా గ్యారేజ్’ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేటెస్ట్ గా తీసుకున్న నిర్ణయం కొత్త తల నొప్పులను తెచ్చి పెడుతోంది అన్న వార్తలు వస్తున్నాయి.  సెప్టెంబర్ 1వ తారీఖు నుండి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని పట్టణాలు దగ్గర నుంచి పల్లెటూర్ల వరకు గోడల పై పోస్టర్లు అంటించే విధానాన్ని నిషేధించింది.

ఈ నిషేదాన్ని చాల ఖచ్చితంగా అమలు చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో ఈ నిర్ణయం వల్ల మొట్టమొదటిగా నష్టపోతున్నది ‘జనతా గ్యారేజ్’ మూవీ అన్న వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమాను సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేస్తున్న నేపధ్యంలో అదే రోజు నుండి పోస్టర్ల పై నిషేధం అమలులోకి రావడడం ‘జనతా గ్యారేజ్’ కి ఊహించని షాక్ అని అంటున్నారు.

ముఖ్యంగా జూనియర్ సినిమాలకు గుండెకాయలా బిసి సెంటర్ల కలక్షన్స్ చాల కీలకంగా వ్యవహరిస్తాయి. కాబట్టి ఈ పోస్టర్లను అంటించే నిషేడంతో బిసి సెంటర్లలో ‘జనతా గ్యారేజ్’ కి బాగా ప్రచారం జరగాలి అంటే ఈ సినిమా నిర్మాతలు ప్రింట్ మీడియా ఎలాట్రానిక్ మీడియాలలో ఇంకా కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.  

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం యాదృచ్చికంగా ‘జనతా గ్యారేజ్’ మూవీ విడుదల అవుతున్న తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో అమలులోకి వస్తున్న నేపధ్యంలో ఈ నిర్ణయం అమలు వెనుక జూనియర్ సినిమా పబ్లిసిటీని  కార్నర్ చేయడానికి ఎవరైనా వ్యూహాత్మక ఎత్తుగడ వేశారా ? అన్న అనుమానాలు కూడ కొందరు వ్యక్తం చేస్తున్నారు.

గత సంక్రాంతికి విడుదలైన నాన్నకు ప్రేమతో సినిమాకు ధియేటర్లు దొరకకుండా టాలీవుడ్ లోని ఒక వర్గం ప్రయత్నించిన  నేపధ్యం తెలిసిందే. ఇదే తరహా ఎత్తుగడలతో పోస్టర్ల నిషేధం నిర్ణయం కూడ ‘జనతా గ్యారేజ్’ విడుదల తేదీ నుంచే అమలులోకి రాబోతోందా ? అంటూ మరి కొదరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. 

ఏది ఎలా చూసుకున్నా ఇప్పటికే ‘జనతా గ్యారేజ్’ మ్యానియా మన ఇరు తెలుగు రాష్ట్రాలలోను ఒక సునామీల విస్తరిస్తున్న నేపధ్యంలో ఇటువంటి చిన్నచిన్న అవాంతరాలు ‘జనతా గ్యారేజ్’ ని ఏవిధంగాను దెబ్బ తీయలేవు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: