నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ‘ప్రేమమ్’ టీమ్ విడుదల చేసిన ‘ఎవరే ఎవరే’ అనే పాట టీజర్ వినడానికి ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. అంతే కాకుండా ఆ పాటకు దర్శకుడు చందూ మొండేటి చక్కటి విజువల్స్ తో చిత్రీకరించడంతో చైతన్య అభిమానులు ఈ సాంగ్ టీజర్ ను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.  

ఈ సినిమా మలయాళ వర్షన్ కు హైలెట్ గా నిలిచిన మలార్ పాత్రలో శ్రుతి హాసన్ ఎలా ఉంటుందో అన్న అనుమానాలు ఆమె ‘ప్రేమమ్’ ఒరిజినల్ మూవీలో నటించిన సాయిపల్లవిని మరిపరిపించగలదా అని అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  ఈ అనుమానాలు వ్యక్తం చేసిన వారికి శ్రుతి ఈ పాత్రలో బాగా ఒదిగిపోయి చాల చక్కగా కనిపించింది అన్న పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తునాయి.  

‘‘అందరు అందమైన అమ్మాయిలూ సినిమాల్లోకే వెళ్లరు. కొందరు టీచింగ్ లోకి కూడా వస్తారు’’ అనే కొటేషన్ ను ఈ పాటలో చైతన్య శ్రుతిహాసన్ కి చూపించే షాట్ ఈ పాటకు హైలైట్ అంటూ చైతూ అభిమానులు పొంగి పోతున్నారు.  అయితే ఇదంతా ఈమూవీకి ఒక వైపు ఉన్న పాజిటివ్  విషయం.  చందు మొండేటి  దర్శకత్వంలో ఇప్పటికే షూటింగ్  పూర్తి అయిన ఈసినిమాలో మళయాలంలో హిట్ అయిన అదే సినిమాకు సంభందించిన ట్యూన్లు, అదే సాంకేతిక వర్గంపని చేయడం తో ఈసినిమాలో తెలుగు నెటివిటీ చాలా తక్కువగా కనిపించింది అనే కామెంట్స్ హడావిడి చేస్తున్నాయి. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం నాగ్ ‘ప్రేమమ్’  కు కాస్త లైటర్ వీన్ కామెడీ టచ్ ఇవ్వమని చెప్పినట్లు టాక్. అయితే దర్శకుడు చందు మొండేటి  నాగ్ సూచనలను ‘ప్రేమమ్’ విషయంలో పెద్దగా అమలు చేయలేక పోయాడు అనే  గాసిప్పులు వినిపిస్తున్నాయి.  ఇది ఇలా ఉండగా నాగార్జున ‘ప్రేమమ్’ ఫైనల్ అవుట్ పుట్ ను చూసి  కాస్త మార్పులు చెప్పాడు అనే వార్తలు కూడ వస్తున్నాయి. 

దీనితో ఈసినిమాకు చిన్నచిన్న ప్యాచ్ వర్కులు చేసినట్లు టాక్. అంతేకాకుండా ఈ సినిమాకు అదనపు ఆకర్షణ తేవడం కోసం నాగ్ కూడా ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించాలని డిసైడ్ అవడం తో ఆరోల్  షూటింగ్ కూడ ఈ మధ్యనే పూర్తి  చేసారు అని టాక్. ఇప్పటికే ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో వెంకటేష్ నటిస్తూ ఉండటంతో దానికి తోడుగా నాగార్జున కూడ రంగంలోకి దిగుతున్నాడు.  అయితే ఇప్పుడు ఈ సినిమా ఫలితం పై కాస్త టెన్షన్ నెలకొన్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.  

ముఖ్యంగా నాగ్ చైతన్య ఈ సినిమాకు  సరైన చాయస్ కాదని టాక్ వినిపిస్తోంది. ఈసినిమాలో తనపాత్రకు సంబంధించిన తన ఫీలింగ్ లు నాచురల్ గా చూపించడంలో చైతు పెద్దగా సక్సస్ కాలేదు అన్న గాస్సిప్పులు కూడ హడావిడి చేస్తున్నాయి.  అదీ కాకుండా ‘ప్రేమమ్’  కేవలం ఎ సెంటర్ల సినిమా అని రిజల్ట్ ఏమాత్రం తేడా వచ్చినా బిసి సెంటర్లలో  దీని వంక చూసే ప్రేక్షకులు ఉండరు అనే నెగిటివ్  ప్రచారం కూడ ఈ సినిమా పై జరుగుతోంది. దీనితో ఈ సినిమాను  కొనుక్కున్న బయ్యర్లు జంకుతున్నారు అనే వార్తల హడావిడి ఫిలింనగర్ లో జరుగుతోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: