తెలుగు ఇండస్ట్రీలో వారసత్వపు హీరోల హవా సాగుతున్న తరుణంలో నందమూరి ఫ్యామిలీలో మూడవ తరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. తాత మెచ్చిన మనవడిగా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమా పెద్దగా విజయం కాకపోయినా రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెం. 1 చిత్రంతో మంచి విజయం సాధించాడు..అదే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తర్వాత ఆది, అదుర్స్,బాద్ షా లాంటి సినిమాలతో ఒక్కసారిగా మాస్ ఇమేజ్ పెంచేసుకున్న ఎన్టీఆర్ మరోసారి రాజమౌళి కాంబినేషన్ లో ‘యమదొంగ’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ సాధించడమే కాకుండా ఎన్టీఆర్ నట విశ్వరూపం కూడా చూపించాడు.
Image result for janatha garage new stills
గత సంవత్సరం టెంపర్ చిత్రంతో తన నటనతో అందరిని ఆశ్చర్యపరిచారు..నెగిటీవ్..పాజిటీవ్ షేడ్స్ తో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందాడు. ఈ సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో చిత్రం కూడా మరో ఘన విజయం సాధించింది..ఈ చిత్రం 50 కోట్ల క్లబ్ లో చేరింది. ప్రస్తుతం కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ‘జనతా గ్యారేజ్’ చిత్రం రాబోతుంది. దినిపై విపరీతమైన అంచనాలు పెరిగిపోతున్నాయి. గత సంవత్సరం కొరటాల, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరింది..మరి ఇప్పుడు వస్తున్న ‘జనతా గ్యారేజ్’ కూడా వంద కోట్ల క్లబ్ లో చేరాలిన చేరుతుందని చిత్ర యూనిట్ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
Image result for janatha garage new stills
ఇప్పటివరకు ఎన్టీఆర్ కెరీర్ లో 50 కోట్ల షేర్ మాత్రమే ఉంది ఈ జనతా గ్యారేజ్ తో వంద కోట్ల షేర్ ని అందుకుంటాడా అన్నది చూడాలి . ఎన్టీఆర్ స్టామినా కి తగ్గట్లుగా సరైన సినిమా పడాలి కానీ వంద కోట్లు పెద్ద మ్యాటర్ కాదు కానీ ఏమాత్రం తేడా వచ్చిన అది ఎన్టీఆర్ ని నమ్ముకున్న బయ్యర్ల కు నష్టాలను మిగల్చడం ఖాయం .


మరింత సమాచారం తెలుసుకోండి: