ప్రస్తుతం టాప్ హీరోలు కానీ టాప్ క్రీడాకారులు కాని వారి వారి ఫీల్డ్ లో కంటే ఎక్కువగా యాడ్స్ లో కనిపిస్తున్నారు. జనాల్లో మంచి పాపులారిటీ సంపాదించిన సెలబ్రెటీలను వెంటనే కార్పోరేట్ సంస్థలు వెంటనే తమ ఉత్పాదనలకు యాడ్స్ రూపంలో వాడుకుంటారు..అంతే కాదు ఒక్క సినిమా ఎన్నో రోజులు షూట్ చేయాల్సి ఉంటుంది..కానీ యాడ్స్ కొన్ని రోజుల్లో పూర్తి చేస్తే దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ గిట్టుబాటు అవుతుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ వారు తెగ యాడ్స్ చేస్తూ డబ్బు బాగా సంపాదిస్తున్నారు.  ఇక గత సంవత్సరం బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పటి వరకు ఎలాంటి యాడ్స్ లో నటించలేదు కానీ బాహుబలి చిత్రం తర్వాత మనోడికి వరుసగా కార్పోరేట్ సంస్థలు బాగా సంప్రదించారు.
Image result for Prabhas launches Well Care health
ఇప్పటికే మహింద్రా మోటార్స్ కి సంబంధించిన యాడ్ లో నటించిన ప్రభాస్ తాజాగా మరో కార్పోరేట్ హాస్పిటల్  సంస్థ కోసం  అంబాసిడర్ గా వ్యవహరించడానికి మంచి మనసుతో ముందుకు వచ్చాడు రెబల్ స్టార్ ప్రభాస్ .  ఇప్పటికే ప్రభాస్ కి వచ్చిన ఇమేజ్ తో క్యాష్ చేసుకోకుండా ఓ సంస్థ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి నయా పైసా తీసుకోకుండా ఫ్రీగా చేస్తున్నాడు.
Image result for Prabhas launches Well Care health
దీని వెనుక రహస్యం తెలిస్తే ప్రభాస్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..ఎందుకంటే ఈ సంస్థ సామాన్యులకు   సేవలు  అందిస్తున్న విషయం  తెలియడానికి అంతే కాదు వెల్ కేర్ హెల్త్ కార్డు కేవలం 999/- మాత్రమే ! సంవత్సరానికి కేవలం తొమ్మిది వందల తొంబై తొమ్మిది రూపాయలు చెల్లిస్తే ఖరీదైన వైద్య ఖర్చులను సదరు సంస్థే భరిస్తుంది అందుకే ప్రభాస్ తన వంతు సేవలు అందించడానికి ముందుకు వచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: