స్టార్ హీరోల సినిమాల మధ్య పోటీ ఎప్పుడు ఉంటుందే అయితే టాలీవుడ్ హీరోల మార్కెట్ ఇప్పుడు పెరిగిపోయింది. కేవలం టాలీవుడ్ లోనే కాదు మిగతా భాషల్లో కూడా తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ఇక ఆ క్రమంలో మలయాళంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు అక్కడ స్టార్ హీరోల ఇమేజ్ ఉంది. బన్ని సినిమాలు అక్కడ మంచి మార్కెట్ సాధించడమే కాదు మంచి కలక్షన్స్ కూడా తెచ్చిపెడుతున్నాయి. అయితే ఇప్పుడు బన్నికున్న మాల్లూ క్రేజ్ కు ఎసరు పెట్టే క్రమంలో యంగ్ టైగర్ తన ప్రయత్నాలు చేస్తున్నాడు.


ప్రస్తుతం తారక్ నటించిన జనతా గ్యారేజ్ మలయాళంలో కూడా భారీ రేంజ్లో రిలీజ్ అవుతుంది. అక్కడ స్ట్రైట్ సినిమా ఫీల్ కలిగిస్తున్న ఈ మూవీతో బన్నికి షాక్ ఇస్తున్నాడు తారక్. బాహుబలి మలయాళంలో 14 కోట్లు కలక్ట్ చేసింది. అయితే ఆ తర్వాత డబ్బింగ్ సినిమాల టాప్ లిస్ట్ చూస్తే అన్ని అల్లు అర్జున్ సినిమాలే ఉంటాయి. సరైనోడు 7.5 కోట్లు, రుద్రమదేవి 4.5 కోట్లు, సన్నాఫ్ సత్యమూర్తి 4 కోట్లు, రేసుగుర్ర్రం 2.7 కోట్లు ఇలా ఒకటో స్థానం కాకుండా మిగతా అన్నిటిన్ బర్తి చేశాడు బన్ని.


అల్లు అర్జున్ ఇక్కడ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా అక్కడ మంచి హిట్ సాధించాయి. అయితే ఇప్పుడు జనతా గ్యారేజ్ ఏకంగా 8 కోట్లకు మలయాళం రైట్స్ కొనేశారు. మోహన్ లాల్ ఉండటం వల్ల సినిమా అంతకు అంత రాబడుతుందని నమ్మకంతో ఉన్నారు పంపిణీదారులు. ఈ లెక్కన చూసుకుంటే టాప్ సెకండ్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ వచ్చి చేరుతాడని చెప్పేయొచ్చు. బన్నికి మలయాళంలో ఉన్న ఇమేజ్ ను  దెబ్బతీయాలనే ఆలోచనతో జూనియర్ ఈ ప్లాన్ వేశాడు.  


మరి అనుకున్నట్టుగా టైగర్ ప్లాన్ వర్క్ అవుట్ అవూతుందో లేదో చూడాలి. ఇక మలయాళ భామ నిత్యా మీనన్ కూడా సినిమాలో భాగమవ్వడం అక్కడ కలిసి వచ్చే అంశం. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ ను నేచర్ లవర్ గా కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన జనతా గ్యారేజ్ ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాలి. ప్రస్తుతం సినిమా రిలీజ్ రెండు రోజులే ఉండటంతో ఎక్కడ చూసిన ఆ సినిమా గురించే హాట్ టాపిక్ గా నడుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: