1వ తారీఖున విడుదల కాబోతున్న ‘జనతా గ్యారేజ్’  మ్యానియా హద్దులు దాటింది అని చెప్పే ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.  టాప్ హీరోల సినిమాల విడుదలకు ముందు స్పెషల్ షోలు బెనిఫిట్ షోలు వేయడం సర్వసాధారణ విషయం.  అయితే మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా పక్కన ఉన్న తమిళనాడుకు  కూడ ఈ సినిమా మ్యానియా సునామీలా తాకడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాకు సంబంధించి చెన్నైలో వేయబోతున్న బెనిఫిట్ షో టిక్కెట్లను జూనియర్ అభిమానుల సంఘం వేలం వేస్తే మొదటి టిక్కెట్ ను చెన్నైలోని జూనియర్ వేరాభిమాని 31 వేలకు కొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఇద సినిమా బెనిఫిట్ షోకి సంబంధించి రెండవ టిక్కెట్ ను 17, 500 లకీ మూడవ టిక్కెట్ ను 13 వేలకీ మరో ఇద్దరు వీరాభిమానులు కొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ బెనిఫిట్ షో టిక్కెట్ల వేలం ద్వారా వచ్చిన డబ్బును చెన్నై లోని తెలుగు దేశం యువసేన  కార్యకర్తలు చెన్నైలో కొన్నీ సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి వినియోగిస్తారు అని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ‘జనతా గ్యారేజ్’      బెనిఫిట్ షోల విషయంలో ఏర్పడిన సందిగ్ధత తొలిగి పోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

దీనితో అనుకున్న విధంగానే తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఆంధ్రపదేశ్ లో కూడ ‘జనతా గ్యారేజ్’ స్పెషల్ షోలకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు జరుగుతున్న హడావిడిని విశ్లేషిస్తున్న టాలీవుడ్ పండితులు ఈ సినిమా మొదటిరోజు కలక్షన్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయి అన్న లెక్కలు అప్పుడే మొదలు పెట్టేసారు. 

టాలీవుడ్ పండితుల విస్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈసినిమా మొదటి రోజు కలక్షన్స్ పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫస్ట్ డే కలక్షన్స్ ఫిగర్ ను దాటిపోవడం ఖాయం అని అంటున్నారు.  అంతేకాదు కొన్ని ఏరియాలలో ఈ సినిమా ఫస్ట్ డే కలక్షన్స్ ‘బాహుబలి’ రికార్డ్స్ ను క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.

100 కోట్ల కలక్షన్స్ టార్గెట్ గా విడుదల అవుతున్న ‘జనతా గ్యారేజ్’ ఓపినింగ్ డే కలక్షన్స్ ఫిగర్ ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్లు దాటిపోయినా ఆశ్చర్యం లేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి.  ఎప్పటి నుంచో జూనియర్ కలలు కంటున్న రికార్డుల పర్వానికి ‘జనతా గ్యారేజ్’  రంగం సిద్ధం చేసినట్లుగా స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: