తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు హ్యాట్రిక్ హిట్స్ సాధించిన వారి లీస్టులో చాలా తక్కువ మంది హీరోలు, డైరెక్టర్లు వస్తారు..అలాంటి లీస్టులో చేరిపోవాడానికి ఎవరైనా చాలా సిన్సియర్ గా ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఈ లీస్టులోకి చేరాలని తహ తహలాడుతున్నారు ఇద్దరు వారే జూనియర్ ఎన్టీఆర్ గత సంవత్సరం ‘టెంపర్’, ఈ సంవత్సరం ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాలతో మంచి విజయం సాధించారు..ఇక మిర్చి, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బ్లస్టర్స్ అందించిన దర్శకులు కొరటాల శివ ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తుంది ‘జనతా గ్యారేజ్’.

ఇప్పటికే ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ఇక పెద్ద సినిమాలు వస్తే బెనిఫిట్ షోలు తప్పకుండా ఉంటాయి. తాజాగా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రం బెనిఫిట్ షోలకు సిద్దమైంది , అయితే ఆంధ్రప్రదేశ్ లో ఆ సినిమాకు కొన్ని ఆటంకాలు ఎదురౌతుండగా తెలంగాణలో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా షోలకు సిద్దమైంది . బెనిఫిట్ షోలను పెద్ద ఎత్తున అన్ని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ .

హైదరాబాద్ లో అయితే యమా జోరుగా ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ . ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అందాల భామలు సమంత, నిత్యా మీనన్ లు నటిస్తున్నారు. రాక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ సంగీతం అందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: