సౌత్ సూపర్ బ్యూటీ సమంత ఇంటర్వ్యూల్లో హాట్ కామెంట్స్ చేయడం మాములే.. అయితే ఎవరి గురించో అయితే పర్వాలేదు కాని త్వరలోనే ఒకటి కాబోతున్న నాగ చైతన్య గురించి చాలా తక్కువ చేసి మాట్లాడటం అక్కినేని ఫ్యాన్స్ షాక్ గురయ్యేలా చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ లో నటించిన సమంత రిలీజ్ అవుతున్న సినిమా గురించి ప్రమోషన్స్ లో పాల్గొటుంది. ఇక కొరటాల శివ, ఎన్టీఆర్, సమంత ఇచ్చీ ఇంటర్వ్యూలో సమంత తన కెరియర్ లో ఓ పెద్ద స్టార్ తో సినిమా చేయడం బృందావనం ఎన్టీఆర్ తోనే అనేసింది.   


అయితే జోష్ తో ఎంట్రీ ఇచ్చినా ఏమాయ చేసావే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అక్కినేని వారసుడు నాగ చైతన్యతో ఓ సినిమా చేసిన సమంత చైతుని స్టార్ కాదని తారక్ ను అనడం అందరిని ఆశ్చర్యంలో పడేసింది. సరే తానో సహనటుడు అనుకుంటే పర్వాలేదు కాని సమంత లైఫ్ లోకి రాబోతున్న చైతు గురించి అలా తక్కువ చేసి మాట్లాడటం ఫ్యాన్స్ కు ఏమాత్రం అర్ధం కావట్లేదు. ఇక మరో పక్క మాత్రం హీరోయిన్లు ఏ స్టార్ హీరో సినిమాలో నటిస్తే ఆ స్టార్ ను ఆకాశానికెత్తేయడం మాములేగా అనేస్తున్నారు.


ఆ క్రమంలోనే ఎన్టీఆర్ ముందు నాగ చైతన్య గాలి పూర్తిగా తీసేసింది సమంత. ఇక ఇద్దరు బయట ఎంత కమిట్ మెంట్ తో ఉన్నా కాపాడాల్సిన తనే చైతు స్టార్ హీరో కాదు అనడం హాట్ న్యూస్ అవుతుంది. ఇప్పటికే ఈ వార్తల పట్ల అక్కినేని ఫ్యాన్స్ సమంత మీద గుర్రుగా ఉన్నారట. సరదాగా జరిగిన జనతా గ్యారేజ్ ఇంటర్వ్యూలో సమంత తారక్ ల చిలిపి మాటలు ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తనను మాట్లాడనివ్వకుండా సమంత మాట్లాడేస్తుంది అంటూ అలిగినట్టు తారక్ ఇంటర్వ్యూని సరదాగా ఎంజాయ్ చేశారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: