మెగాస్టార్ చిరంజీవి నాగార్జునుల స్నేహబంధాన్ని వీరిద్దరి పిల్లలు రామ్ చరణ్ అఖిల్ లు కొనసాగిస్తున్నారు.  అవకాశం దొరికినప్పుడల్లా చరణ్ అఖిల్ లు ఎదో ఒక సందర్భంలో కలిసి సరదాగా గడుపుతూ ఉంటారు.  ఒకొక్కసారి ఒకే కారులో వీరిద్దరూ కలిసి ఫంక్షన్స్ కు వచ్చిన సందర్భాలు కూడ ఉన్నాయి.  

అఖిల్ కూడ మెగా కుటుంబం పై అవకాశం వచ్చినప్పుడల్లా తన అభిమానాన్ని చూపెడుతూనే ఉంటాడు.  మెగా స్టార్ చిరంజీవి టాలీవుడ్ రీ ఎంట్రీ పై చాలామంది చాలానే కామెంట్స్ చేసినా అందరిలోకి అక్కినేని అఖిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ చాల స్పెషల్ గా కనిపిస్తూ ఉంటాయి.  

కొన్నాళ్ళ క్రితం జరిగిన  ఒక ఫిలిం ఫంక్షన్ లో అఖిల్ మాట్లాడుతూ 'నేను ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి కంగ్రాట్స్ చెబుతున్నా మెగాస్టార్ ఈజ్ బ్యాక్' అంటూ చిరు ఎదురుగా ఓ అవార్డ్ తీసుకుంటున్న సమయంలో అఖిల్ చేసిన కామెంట్స్ కు ఆ రోజు చిరంజీవి కూడ విపరీతమైన ఆనందాన్ని పొందాడు.

ఇది చాలదు అన్నట్లుగా అఖిల్ మరో అడుగు ముందుకు వేసి చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’  షూటింగ్ స్పాట్ కు రావడమే కాకుండా అక్కడ ఆసినిమా షూటింగ్ స్పాట్ లో అఖిల్ ఆ షూటింగ్ ను బాగా ఎంజాయ్ చేస్తూ  చాలాసేపు ఉన్నాడని తెలుస్తోంది.  అంతేకాదు ఈసినిమా దర్శకుడు వినాయక్ తో ఒక సెల్ఫీ ఫోటో తీసుకుని ఆ ఫోటోను తన ట్విటర్ లో పెట్టి అందరికీ షేర్ చేసాడు. 

అయితే ఇంత వరకు బాగానే ఉన్నా అఖిల్ పోస్ట్ చేసిన ఈ ఫోటోను చూసి కొందరు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.  అఖిల్ రెండవ సినిమా ప్రారంభం ఎప్పుడో అనే విషయం అఖిల్ కే తెలియని పరిస్థితి ఏర్పడటం తో మొన్న నిత్యామీనన్ ‘100 డేస్ ఆఫ్ లవ్’ సినిమాను ప్రమోట్ చేస్తూ కాలం గడిపిన అఖిల్ ఇప్పుడు ఇంకా ఖాళీ బాగా దొరకడంతో ఇలా చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ సెట్లో హడావిడి చేసి ఎదో విధంగా మీడియా వార్తలలో కనిపించడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ అఖిల్ పై కొందరు సెటైర్లు వేస్తున్నారు.

ఈ వార్తలు ఇలా ఉండగా ఇప్పటికే ఎందరో దర్శకులతో ఆటాడుకుంటున్న అఖిల్ గేమ్ ప్లాన్ లో లేటెస్ట్ గా మారుతి వచ్చి చేరినట్లు వార్తలు వస్తున్నాయి.  ‘బాబు బగారం’ ఫెయిల్యూర్ తరువాత ఖాళీగా ఉన్న మారుతి ఒక వెరైటీ స్టోరీ అఖిల్ కోసం వ్రాసి అతడిని మెప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు టాక్..    



మరింత సమాచారం తెలుసుకోండి: