తెలుగు సినీ పరిశ్రమను తారా స్థాయికి చేర్చి తెలుగు ప్రజల ప్రేక్షక హృదయాల్లో చిరకాలం నిలిచినా మహాశయుడు ఎవరంటే టక్కున వచ్చే సమాధానమే నందమూరి తారక రామా రావు. ఒకేసారి తెలుగు సినీ పరిశ్రమలో రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన గొప్ప నేతగా పేరుతెచ్చుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన తర్వాత అంతటి వాక్ చాతుర్యం, ఆహార్యం, అభయనం కలిగిన వ్యక్తి ఎవరంటే ఎన్టీఆర్ వారసుసు స్వయాన ఆయన మనవడు తారాక్ అని ఎవ్వరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. 


Image result for juniar ntr

తాతా గారి పేరుపెట్టుకొని ఆయన పేరును ప్రపంచా స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న తారక్ ను అందరూ అభినందించాల్సిందే. అయితే ఈ జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి ఎదగడానికి ఎంతో కృషి చేశారనే విషయం అందరికీ విదితమే. అయితే ఈ విజయం ఆయనికి అంత సులువుగా సొంతం అయిందా...? అని ప్రశ్నించుకుంటే లేదనే సమాధానమే విస్పష్టం. ఆయన సినీ పరిశ్రమకు పరిచయమైనా మొదట చాలా కొద్ధ్హి సినిమాల్లో పేరు గడించితే, ఎక్కువగా ఆయన తీసిన సినిమాలు సష్టాలనే చవిచూశాయి. ఈమధ్య ఎన్టీఆర్‌లో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆ మార్పు ఫలితమే... ‘టెంపర్‌’, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘జనతా గ్యారేజ్‌’లో ఆ మార్పు మరింత కనిపిస్తుందంటూ భరోసా ఇస్తున్నారు ఎన్టీఆర్‌. గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మీడియా తో ముచ్చటించారు. 


Image result for juniar ntr

నటన గురించి మాట్లాడడం చాలా కష్టం. నేను ఇలా నటిస్తా.. అలా నటిస్తా అని చెప్పలేను. నటన అన్నది చెబితే రాదన్నది నా ఉద్దేశం. ఫీల్‌ అవ్వాలంతే. స్నేహితుడు చనిపోయిన సన్నివేశంలో నటించాలనుకోండి. అలాంటి అనుభవం నాకు నా జీవితంలో అప్పటి వరకూ ఎదురుకాకపోవొచ్చు. అలాంటి పరిస్థితి వస్తే నేను ఎలా స్పందిస్తాను? ఏం చేస్తాను? అనే వూహల్లోకి వెళ్లిపోవాలి. అంతే తప్ప... ఇలా ఏడవాలి, ఇలా నవ్వాలి, ఇలా మాట్లాడాలి అని చెబితే నటన వచ్చేయదు.
మార్పు గురించి...


Image result for juniar ntr

ఫలితాలే. అంటే ప్రేక్షకులు అన్నమాట. నేను వండేది నా కోసం కాదు కదా. ప్రేక్షకులకు నచ్చాలి. వాళ్లకు నచ్చితే మళ్లీ అలాంటి ప్రయత్నాలు చేస్తుంటాం. లేదు మేం ఇలాంటి సినిమాలే చేస్తుంటాం... మీరు చూడండి అంటే చెంపదెబ్బలు పడతాయి. అలాంటి దెబ్బలు నాకూ తగిలాయి. అప్పుడే కదా నేనూ మారాను. మాకేదో స్టార్‌డమ్‌ ఉంది... మేం స్టార్‌ హీరోలం అని మేం అనుకొంటుంటాం. నిజానికి అలాంటిదేం లేదు. కానీ దాన్ని కూడా మనమే నిరూపించుకోవాలి. అలా నిరూపించుకోవాలంటే మంచి కథలు ఎంచుకోవాలి. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా అదే కదా? అది నా సినిమాలా ఉండదు. కానీ నేనేం ప్రేక్షకుల్ని ముందుగా ప్రిపేర్‌ చేయలేదు. ‘కష్టపడి తీశాం... ఎలాగున్నా మీరు చూడాల్సిందే’ అనలేదు. వాళ్లకు నచ్చింది, చూశారు.


Image result for juniar ntr

మారుతున్న రాజకీయ పరిణామాల్ని పరిశీస్తున్నారా? 
లేదండీ. అంత తీరిక లేదు. సినిమాలు, కథలు, అభయ్‌... ఇలా టైమ్‌ అంతా వాటికే సరిపోతుంది. తెలుగు దేశం పార్టీతో సన్నిహితంగా ఉన్నానా, దూరంగా ఉన్నానా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పీ చెప్పీ విసుగొచ్చేసింది. అప్పట్లో పార్టీ కోసం ప్రచారం చేశా. నా బాధ్యత అయిపోయింది. సినిమాల్లో పడిపోయా. చెప్పా కదా... నాకు అన్నింటికంటే నటనే ముఖ్యమని. నటుడిగా కొనసాగడమే నాకిష్టం.


మరింత సమాచారం తెలుసుకోండి: