రేపు విడుదల కాబోతున్న జూనియర్ సినిమా ‘జనతా గ్యారేజ్’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ తన మాటలకు తన తల్లి షాలిని ఏవిధంగా షాక్ అయింది అన్న ఒక ఆ శక్తికర విషయాన్ని జూనియర్ బయట పెట్టాడు.  తన తల్లి ప్రతిరోజు రాత్రి రేపు ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఏమికావాలి అని అడిగినప్పుడు తాను రేపటి విషయం గురించి ఈరోజు ఆలోచించను అని చెపుతూ తాను రేపు నిద్ర లేచిన తరువాత చెపుతాను అంటూ తరుచు తన తల్లికి చెప్పే విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు జూనియర్.

తను ఇలా మాట్లాడటానికి ఒక ప్రధాన కారణం ఉంది అని అంటూ రేపు ఏమి జరగబోతుందో ఎవరికీ తెలియదని సెలెబ్రెటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు రేపు ఏమి జరుగుతుంది అన్న విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుందని అర్ధం కాని విషయాల గురించి ఆలోచించి తాను తన మనసు పాడుచేసుకోను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు జూనియర్.  అందువల్లనే తాను నటించే సినిమాల రికార్డులు గురించి రిజల్ట్ గురించి పెద్దగా పట్టించుకోను అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు జూనియర్.

ఇదే సందర్భంలో సినిమాలలోని రొమాంటిక్ సీన్స్ గురించి మాట్లాడుతూ తాను అటువంటి సీన్స్  లో నటించేడప్పుడు కొంత వరకు తాను ఇబ్బంది పడతాను అన్న విషయం వాస్తవం అని అంటూ ప్రస్తుతం మారిపోయిన యూత్ ట్రెండ్ రీత్యా లవ్ స్టోరీలలో నటించాలని తనకు కోరిక ఉంది అన్న విషయాన్ని బయట పెట్టాడు.  అయితే తన అభిమానులు తాను అటువంటి సినిమాలలో నటిస్తే అంగీకరిస్తారా ? అంటూ తన పై తానే సెటైర్ వేసుకున్నాడు జూనియర్.

ఇక తన కొడుకు అభయ్ రామ్ గురించి మాట్లాడుతూ  అభయ్ చేసే అల్లరి పనులను చూసి తాను తట్టుకోలేకపోతున్న విషయాన్ని బయట పెడుతూ ఈ మధ్య ఒక సందర్బంలో అల్లరి చేస్తున్న తన కొడుకును మందలించిన సందర్భాన్ని బయట పెట్టాడు.  అయితే తిరిగి అదే రోజు తనను కోపంతో చాల కసిగా అభయ్ కొట్టిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ నేటితరం పిల్లలు చాల హైపర్ యాక్టివ్ గా మారిపోయారు అంటూ తన కొడుకు పైనే సెటైర్ వేసుకున్నాడు జూనియర్. 

ఇక తన జీవితంలో జరిగిన ఎన్నో ఊహించని సంఘటనలు తనలో ఎంతో మార్పు తీసుకు వచ్చిన సందర్భాన్ని  ప్రస్తావిస్తూ తాను గడిచిన గత సంఘటనల నేపధ్యంలో రేపటి గురించి ఆలోచించడం మానివేసానని కేవలం ఈరోజు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.  

జూనియర్ కామెంట్స్ ను లోతుగా పరిసీలిస్త్ తారక్ లో ఒక వేదాంత ధోరణి మొదలు కావడమే కాకుండా ఈ టాప్ హీరోల నెంబర్ రేస్ విషయంలో బయటపడని నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోంది.  అయితే అనుకున్న స్థాయిలో ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అప్పుడు తారక్ మాటలు ఎలా ఉంటాయో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: