దర్శకుడు వివి వినాయక్ పై ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తున్న రూమర్స్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి.  హడావిడి చేస్తున్న ఈ రూమర్స్ ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం వినాయక్ నిద్రలేని రాత్రుళ్లు అసహనంతో గడుపుతున్నాడని వార్తలు వస్తున్నాయి.

దీనికి కారణం చిరంజీవి నటుస్తున్న ‘ఖైదీ నెంబర్ 150’ అన్న మాటలు వినిపిస్తున్నాయి.  ఈ సినిమా షూటింగ్ పరుగులు తీస్తూ ఉన్నా వినాయక్ కు ఎదో తెలియని అసంతృప్తి పెరిగి పోయి అతడిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నట్లు టాక్.  

మెగా కాంపౌండ్ ఈ సినిమా విషయానికి సంబంధించి ప్రతి చిన్న విషయంలోనూ కల్పించుకుని వినాయక్ కు రకరకాల సూచనలు చేస్తూ ఉండటంతో పాటు ఆ సూచనలు రోజురోజుకు ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంటూ ఉండటంతో వినాయక్ ఈసినిమా విషయంలో దర్శకత్వం వహించడానికి చాల టెన్షన్ పడుతున్నట్లు టాక్.  దీనికితోడు ఈసినిమా టీజర్ విడుదలకే అత్యంత హడావిడి అయిన నేపధ్యంలో ఈసినిమా హిట్ అయి తీరాలి అని మెగా కాంపౌండ్ పెంచుతున్న ఒత్తిడికి వినాయక్ తెగ టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఎంత ఆలోచించి తీసినా ఒక సినిమా సూపర్ హిట్ లేదా ఫ్లాప్ అనే విషయం ప్రేక్షకులు ఇచ్చే తీర్పు పై ఆధారపడి ఉన్న నేపధ్యంలో ఒక రీమేక్ సినిమాకు ఎంత ఆలోచనలు చేసినా అద్భుతాలు ఎక్కడ నుంచి వస్తాయి అన్న ఖంగారు వినాయక్ లో రోజురోజుకు పెరిగి పోతోంది అని అంటున్నారు. రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈసినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో మార్పులు చేసినా ఆ మార్పులు మెగా అభిమానులకు ఎంత వరకు నచ్చుతాయి అన్న బయటకు చెప్పుకోలేని భయం వినయాక్ ని వెంటాడుతోంది అని టాక్.

గత సంవత్సరం ‘అఖిల్’ సినిమా ఘోరపరాజయం చెందినప్పుడు దర్శకుడుగా తన తప్పు లేకపోయినా నాగార్జున అఖిల్ అభిమానుల విమర్శకులకు తట్టుకోలేక క్షమార్పణలు చెప్పుకోవలసి వచ్చిన పరిస్థితి అప్పట్లో వినాయాక్ కు తీవ్ర మనస్తాపాన్ని కలిగించింది.  ఇప్పుడు మళ్ళీ ‘ఖైదీ నెంబర్ 150’ విషయంలో మెగా అభిమానుల అంచనాలను అందుకోలేకపోతే తన పరిస్థితి ఏమిటి ? అని వినాయక్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు టాక్.  

ఈ వార్తలు ఇలా ఉండగా ఇప్పటికే ప్రకటింప బడ్డ ‘ఖైదీ నెంబర్ 150’ టైటిల్ ను మారిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు మెగా కాంపౌండ్ కు వచ్చింది అన్న విషయం వినాయక్ ను మరింత గందరగోళంలో పడేస్తోంది అని టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: