టెంపర్ ,నాన్నకు ప్రేమతో రెండు సినిమాలూ తారక్ కెరీర్ లో చాలా ముఖ్యమైనవి. టెంపర్ సినిమా ఆడియో ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ ని కొత్తగా పరిచయం చేస్తున్నాం. ఇండస్ట్రీ కి కొత్త తారక్ ని నేను అందించాను అని పూరీ జగన్నాథ్ చెప్తే అందరూ ఏంటో అనుకున్నారు. టెంపర్ సినిమా చూసిన తరవాత అర్ధం అయ్యింది. ఎన్టీఆర్ కెరీర్ లో నవ శకానికి నందిగా టెంపర్ మొదలైంది అని. ఎన్టీఆర్ ఆహార్యం , బాడీ, లూక్స్ , బట్టలు , స్టైల్ , మ్యానరిజం ఒకటి కాదు పూర్తిగా తారక్ ని మార్చేశాడు పూరీ .


సాధారణంగానే పూరీ జగన్నాథ్ హీరోలు అంటే విపరీతమైన పొగరు, ఈగో తో ఉంటారు ఇక టెంపర్ లో ఎన్టీఆర్ లోని నట విశ్వరూపాన్ని బయటకి తీసిన పూరీ జగన్నాథ్ ఒక అల్టిమేట్ పాత్రతో అల్టిమేట్ యాక్టర్ ని చూపించాడు. పొగరు , ఇగో , అవినీతి తో నిండిపోయిన పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడు - అలాంటి వ్యక్తి మారిపోయి మంచి చేస్తే ఎంతటి ఘనకార్యాలు జరుగుతాయి అనే పాయింట్ మీద నడిచే కథలో మూస పట్టిపోయి ఉన్న ఎన్టీఆర్ ని నిజంగానే కొత్తగా పరిచయం చేసాడు. ఆ సినిమా తరవాత వచ్చిన నాన్నకు ప్రేమతోలో కూడా మనకి కొత్త ఎన్టీఆర్ కనిపిస్తాడు.


తన తండ్రికోసం కొండను ఎదురుకొనే కొడుకు అభిరాం గా మనోడు ఆ క్యారెక్టర్ ని చింపేసాడు. ఆ రెండు భారీ క్యారెక్టర్ ల తరవాత ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాకి సంతకం పెట్టగానే ఫాన్స్ తో పాటు సినిమా లవర్స్ కూడా హుషారు ఫీల్ అయ్యారు. దానికి కారణం కొరటాల రైటింగ్ కి ఎన్టీఆర్ మ్యానరిజం తోడు అయితే తెరమీద ఫుల్ పాజిటివ్ నెస్ ఉంటుంది అని. నిజమే ఆ పాజిటివిటీ ఇప్పటి వరకూ జనతా గ్యారేజ్ ని కాపాడుతూ వచ్చింది. ఈ కాంబినేషన్ సెట్ అవ్వడమే మొదటి సూపర్ హిట్ ఆ తరవాత మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్, అద్భుత నటుడు ఈ టీం తో కలిసి అతిపెద్ద పాత్ర చెయ్యడం ఇంకా పెద్ద హిట్.


నిత్య మీనన్ లాంటి వినూత్న నటి తో ఎన్టీఆర్ స్క్రీన్ పంచుకోవడం కూడా సూపర్ హిట్టే. ఆ మధ్య సినిమా షూటింగ్ లో ఉండగా ఈ సినిమాలోని కొన్ని డాన్స్ సీన్ లు లీక్ అయ్యాయి అవి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతూ ఫాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చాయి. సినిమా ట్రైలర్ , ఫస్ట్ లుక్ కూడా రాకముందే తమ ఫేవరేట్ హీరో వేసిన రిస్కీ స్టెప్ చూసేసిన ఫాన్స్ సినిమాలో ఎన్టీఆర్ డాన్స్ ల మీద ఒక రేంజ్ ఎక్స్ పెక్టేషన్ లు పెంచేసుకున్నారు. ఆ తరవాత విడుదల అయిన ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూని డిస్కస్ చేస్తున్నారని తెలియగానే విమర్శకులు కూడా ప్రశంసించేశారు.

సినిమా లవర్స్ కూడా కొత్తగా ఫీలయ్యారు. ఎదో సంబంధం లేని బ్యాక్ డ్రాప్ తో ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టేసి ఎన్టీఆర్ ని వీరోచితంగా చూపించడం అనే మూస లోంచి మాస్ లో కూడా క్లాస్ టచ్ ఇస్తూ సాగిన కొరటాల స్టైల్ జనం కనక్ట్ అవ్వడానికి తక్కువ టైం పట్టింది. ఇంటర్నెట్ లో బోలెడు రికార్డ్ లు సరిజేస్తూ ఈ ట్రైలర్ సాగుతోంది. ఇక దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ అయితే బంపర్ హిట్. నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు, సర్దార్ గబ్బర్ సింగ్ , జనతా గ్యారేజ్ ఇలా వరస సూపర్ హిట్ ఆడియో లతో దూసుకుపోతున్నాడు దేవీశ్రీ. జయహో జనతా అంటూ సాగే టైటిల్ సాంగ్ కి అయితే రెస్పాన్స్ విపరీతంగా ఉందని చెప్పచ్చు. ఆడియో ఫంక్షన్ భలే పెద్ద సక్సెస్ అవ్వగా ఆడియో ఫంక్షన్ తరవాత విడుదల చేస్తున్న స్పెషల్ పోస్టర్ లు ఒక్కొక్కటీ కిక్ ఇస్తున్నాయి.

ముఖ్యంగా మొన్న వచ్చిన కాజల్ స్పెషల్ ఫోటో అయితే పీక్స్ అన్నట్టు ఉంది. సో…….జనతా గ్యారేజ్ సినిమాకు సంబంధించినంత వరకూ ఇప్పటి వరకూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవుట్ పుట్ మొత్తం హిట్టేనన్నమాట. అందుకోసమే కదా బయ్యర్లు , డిస్ట్రిబ్యూటర్ లు ప్లేస్ తో సంబంధం లేకుండా ఎగబడి మరీ ఈ సినిమాని కొంటున్నారు. మొత్తం మీద రేపు విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ హిట్ కొడుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: