ప్రమాదాలు ఎప్పూడూ చెప్పిరావు..ఆ ప్రమాదాలకు చిన్నా పెద్దా..పేదా ధనికా అనే తారతమ్యాలు అస్సలు ఉండవు. అయితే ఇలాంటి ప్రమాదాలు కొన్ని సందర్భంగా కోరి తెచ్చుకుంటే అనుకోకుండా జరిగే ప్రమాదాలు కొన్ని సార్లు జరుగుతుంటాయి. ఇక సెలబ్రెటీలు వారి పిల్లలు ఇప్పటికే చాలా సార్లు ప్రమాదంలో మృతి చెందిన సంఘటనలు చాలా జరిగిన విషయం తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్లు కోటా శ్రీనివాస రావు, బాబు మోహన్ ల తనయులు ఇలాంటి ప్రమాదంలో మృతి చెందిన వారే..ఇక ఒక రోడ్డు ప్రమాదం జరిగితే చనిపోయేది ఒక్కరే అయినా ఆ కుటుంబ వ్యవస్థ మొత్త రోడ్డున పడుతుంది..అందు రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ వీటిని మాత్రం నివారించలేక పోతున్నారు.
Image result for balakrishna car accident
తాజాగా సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కారు మరోసారి ప్రమాదానికి గురైంది. ఆ మద్య స్వయంగా ఆయన డ్రైవ్ చేస్తున్న తన వాహనం డివైడర్ కి ఢీ కొట్టిన సందర్భంగా ఎలాంటి ప్రమాదం లేకుండా బతికి బయట పడ్డారు. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కారు తీవ్ర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం హైదరాబాద్ లో ని బంజార హిల్స్ లో ఉన్న కాన్సర్ హాస్పిటల్ వద్ద చోటు చేసుకుంది.
Image result for balakrishna car accident
రోడ్డు పక్కన ఉన్న డివైడర్ కి చారు గుద్దుకోవడం తో అందులో ఉన్న ఎయిర్ బలూన్స్ ఓపెన్ అయ్యాయి దానితో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో బాలకృష్ణ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఏమైనా ఈ మద్య కాలంలో సెలబ్రెటీలు ప్రమాదాలు ఏరి కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న మాట వాస్తవం. 


మరింత సమాచారం తెలుసుకోండి: