తెలుగు ఇండస్ట్రీలో నటసార్వభౌముడిగా పేరు తెచ్చుకున్న మహానటులు నందమూరి తారక రామారావు.  అప్పట్లో సాంఘీకం, పౌరాణికం,జానపద చిత్రాల్లో ఆయనకు ఆయనే సాటి..ఇక శ్రీకృష్ణుడు, రాముడి పాత్రలకు ఒక్క ఎన్టీఆర్ మాత్రమే ప్రాణం పోసేవారు. అప్పట్లో కొంత మంది అభిమానులు ఎన్టీఆర్ చిత్రపటాలకు నిజంగానే పూజ చేసేవారట. ఇక సినిమా నిర్మాణ రంగంలో తనకు తానే సాటి అని గిన్నీస్ రికార్డు ఎక్కిన స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు.  

రామానాయుడు వివిధ భాషల్లో 135కు పైగా సినిమాలు నిర్మించి అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్‌ కైవసం చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ అంటే రామానాయుడి వల్లమాలిన అభిమానం.

ఎన్టీఆర్ తో శ్రీకృష్ణ తులాబారం సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ సందర్భంగా ఎన్టీఆర్ కి సూచనలు ఇస్తూ మేకప్ సరిచేస్తున్న రామానాయుడి అపురూప చిత్రం మీకోసం..


మరింత సమాచారం తెలుసుకోండి: