నాగచైతన్య నటిస్తున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’  సినిమా విడుదలకు ఎన్ని కష్టాలు  వస్తున్నాయో ఆ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ మంజిమా మోహన్ కు కూడా సినిమా కష్టాలు వచ్చి పడ్డాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం తనను సినిమాలు మానేయమని తనకు  నటనరాదని చాలా మంది సోషల్ మీడియాలో ఎటాక్ చేసారని ఇప్పటికి చేస్తున్నారని గగ్గోలు పెడుతోంది మంజిమా మోహన్.

ఆమె నటించిన ‘ఒరు వడక్కం సెల్ఫీ’ చిత్రం రిలీజ్ అయ్యాక తనపై సోషల్ మీడియాలో దారుణంగా దాడి చేసారని నటనరాని నీకు సినిమాలు ఎందుకు అంటూ ఫేస్ బుక్ లో ఎటాక్ చేయడమే కాకుండా తీవ్ర విమర్శలు చేస్తూ కామెట్స్ చేయడం చాలా బాధనిపించింది అని అంటోంది ఈ మలయాళీ బ్యూటీ.  అంతేకాదు ప్రస్తుత పరిస్థితులలో ఫేస్ బుక్ ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సాధనాలు మైన్ టైన్ చేయడం కష్టంగా ఉంది అంటూ గగ్గోలు పెడుతోంది.

ఒక సినిమాలో ఫలానా సన్నివేశంలో తాను సరిగ్గా చేయలేదు తన  ఫేస్ లో ఎక్సప్రెషన్స్ పలకలేదు అంటే తను ఏం చేస్తానని అది డైరక్టర్ చూసుకునే వ్యవహారం అని అంటూ డైరెక్టర్ తృప్తి చెందాక మాత్రమే కదా సినిమా బయిటకు వస్తుంది అంటూ విచిత్రమైన ప్రశ్నలు వేస్తోంది.  సోషల్ మీడియాలో ఉండేవాళ్లు ఎక్కువ మంది చదువుకున్న వాళ్లే అయినా  వాళ్ళ బిహేవియర్   బాగాలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ హాట్ బ్యూటీ.

సోషల్ మీడియాలో తన ఫొటోలు పెట్టి తన ఎక్సప్రెషన్స్ తో ట్రోల్ చేసారని ఆమెచేస్తున్న ఆరోపణలు చూసి చాలామంది షాక్ అవుతున్నారు. అయితే ఈమె కామెంట్స్ ను చదివిన వారు మాత్రం ట్రోల్ చేయటం బాధ అనిపించినా అసలు ఇలా చేయడం వలెనే కదా ఈమెకు గుర్తింపు వచ్చింది అంటూ నెటిజన్స్  ఈమె పై మరింత విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ విడుదల తరువాత  బిజీ హీరోయిన్ గా మారిపోతాను అని కలలు కంటోది మంజిమ గౌతమ్ మీనన్ తొలి నుంచి హీరోయిన్స్ హైలెట్ చేస్తూ సినిమాలు తీస్తూ ఉంటాడు కాబట్టి తనకి ఈ సినిమా గుర్తింపు  తీసుకువచ్చి  సమంత నాగచైతన్యతో ‘ఏమి మాయ చేసావే’ లో చేసిన తరువాత బిజి హీరోయిన్ గా మరిపోయినట్లుగా తను ఈ సినిమాతో  జూనియర్ సమంతగా మారిపోతాను అని కలలు  కంటోoది మంజిమా మోహన్. 

సామాన్యం గా హీరోయిన్స్ చాలమంది తమను ఫలానా వ్యక్తి ఫోన్స్ లో అసభ్యంగా మాట్లాడి   టార్చర్ పెడుతున్నారని లేదంటే తమకు బూతు ఎస్ ఏమ్ ఎస్ లు పెడుతున్నారు అంటూ కంప్లైంట్స్ ఇవ్వడం చూశాం.  అయితే  దీనికి భిన్నంగా మంజిమా ఇలా ప్రవర్తించడం షాకింగ్ న్యూస్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: