తెలుగు ఇండస్ట్రీలో గత కొంత కాలంగా నందమూరి హీరోల హవా కొనసాగుతుంది.  ఇక  సింహ నుంచి డిక్టేటర్ వరకు నటసింహం బాలకృష్ణ పవర్ ఫుల్ చిత్రాలతో తెలుగు రాష్ట్రాల్లో నందమూరి అభిమానులు అభిమానంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే..ఇక బాలయ్య తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోలు నందమూరి కళ్యాన్ రామ్, జూ. ఎన్టీఆర్ లు మరో రేంజ్ లో ఇండస్ట్రీని ఊపుతున్నారు. గత సంవత్సరం కళ్యాన్ రామ్ పటాస్ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఇదే సంవత్సరం ఎన్టీఆర్ టెంపర్ చిత్రం దుమ్మురేపింది.
Image result for janatha garage
ఇక ఈ సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం కూడా భారీ విజయం సాధించి 50 కోట్ల క్లబ్ లో చేరింది. తాజాగా మిర్చి, శ్రీమంతుడు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సెప్టెంబర్ 1 ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి.  నందమూరి అభిమానుల కోసం థియేటర్ లీస్ట్..!



మరింత సమాచారం తెలుసుకోండి: