తెలుగు ఇండస్ట్రీలో కొన్ని వార్తలు వింటుంటే నిజంగానే ఆశ్చర్యం వేయక మానదు. ఈ మద్య స్టార్ హిరోలు పవన్ కళ్యాన్, ఎన్టీఆర్ అభిమానుల మద్య రగిలిన  అభిమాన రక్కసికి ఓ నిండు ప్రాణం బలైపోయింది..తిరుపతిలో పవన్ కళ్యాన్ ఫ్యాన్ అయిన వినోద్ రాయన్ ని జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయిన అక్షయ్ అనే అతని స్నేహితుడే అత్యంత దారుణంగా పొడిచి చంపిన ఘటన రెండు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. దీంతో టాలీవుడ్  ఒక్కసారిగా షేక్ అయ్యింది..అభిమానం ఇంత రేంజ్ లో ఉందా అలాంటి అభిమానాలు మరెన్ని ఇబ్బందులు కొనితెస్తాయో అని ఒక్కసారిగా భయపడ్డారు. అయితే పవన్ కళ్యాన్ తిరుపతి వెళ్లి అభిమాని కుటుంబాన్ని పరామర్శించి ఇలాంటి అభిమానుల వల్ల కుటుంబాలు రోడ్డున పడతాయని హీరోలు అంటే అభిమానం ఉండాలే కానీ ప్రాణాలు తీసే అభిమానం ఉండకూడదని అంతే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు మొత్తం అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటారన్న విషయం ఎంత మందికి తెలుసు అని ప్రశ్నించారు.
Image result for pawan at tirupathi
మరోవైపు ఎన్టీఆర్ కూడా స్పందించి ఇలాంటి అభిమానులు తనకు లేకున్న పరవాలేదు..కానీ అభిమానం పేరిత తమను ఇలా రచ్చకు ఇడిస్తే ఇబ్బంది పడేది తామే అని అన్నారు. అయితే ఇండస్ట్రీలో హీరోల మద్య ఎలాంటి ఈగో ఫీలింగ్స్ లేవని ఇప్పటికే పలు మార్లు రుజువైంది. ఏ హీరో ఫంక్షన్ అయినా మరో హిరో వెళ్లి అభినందించడం ఈ మద్య నడుస్తున్న ట్రెండ్. ఆ మద్య నాన్నకు ప్రేమతో ఆడియో వేడుక తెల్లారి ఎన్టీఆర్ కి మహేష్ బాబు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపాడు. ఇలా పెద్ద హీరోల సినిమాలు విడుదలైన వెంటనే ఆ సినిమాకు హీరోలు, దర్శకులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్ర ప్రజలు  జనతా ఫీవర్ లో వున్నారు.
Image result for janatha garage
ఎన్టీఆర్ కూడా రిజల్ట్ పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ కి ఓ అతిధి ఫోన్ చేసి షాక్ ఇచ్చారు..ఇంతకీ ఆ అతిధి ఎవరా అనుకుంటున్నారా..! మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. న‌తా గ్యారేజ్ థియేట‌ర్ ట్ర‌యిల‌ర్‌, టీజ‌ర్‌తోపాటు సాంగ్స్ బిట్స్ చూసిన మెగాస్టార్ చిరంజీవి.. ఇంప్రెస్ అయ్యి ఎన్టీఆర్ కు ఫోన్ చేసి అభినందించారాని తెలిసింది. విజువల్స్ చాలా ప్రెస్ గా వున్నాయని, సినిమా మంచి కంటెంట్‌తో ఉంద‌ని సినిమా అద్భుత విజయం సాధిస్తుందని టీం మొత్తానికి అల్ ది బెస్ట్ చెప్పారని తెలిసింది.
Image result for janatha garage
 ఇక ఎన్టీఆర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి..అంత గొప్ప హీరో కాంప్లిమెంట్స్ ఇచ్చారంటే సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయని అంటున్నారు చిత్ర యూనిట్. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే ఈ రోజు (31 )రాత్రికి ఈ సినిమా బెనిఫిట్ షో పడిపోతుంది. 

\


మరింత సమాచారం తెలుసుకోండి: