సినిమా టైటిల్ : జనతా గ్యారేజ్ ( ఇక్కడ అన్నీ రిపేర్ చేయబడును ట్యాగ్ లైన్)
నటీనటులు : ఎన్టీఆర్, మోహన్ లాల్, సమంత, నిత్యామీనన్
దర్శకులు : కొరటాల శివ
ప్రొడ్యూసర్స్ : మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
విడుదల : 01 సెప్టెంబర్ , 2016 
Image result for janatha garage
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి హీరోగా వచ్చిన వారిలో చిన్నప్పుడే హంగామా సృష్టించిన నటుడు ఎన్టీఆర్. తాత మెచ్చిన మనవడిగా  తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులై సీనియర్ ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రములో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. తరువాత బాల రామాయణము చిత్రములో రాముడిగా నటించాడు. 2001లో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ‘స్టూడెంట్ నెం.1’ చిత్రం భారీ విజయం సాధించింది..అప్పటి నుంచి ఎన్టీఆర్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు..వరుస విజయాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగారు. గత సంవత్సరం టెంపర్ చిత్రంతో మంచి దూకుడు పెంచిన తారక్ ఈ సంవత్సరం నాన్నకు ప్రేమతో చిత్రం మరో ఘనవిజయం సాధించింది. ఇదే జోష్ లో శ్రీమంతుడు డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ చిత్రంతో  సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.  ఈ చిత్రంపై ఇప్పటికే ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి..అతే కాదు మొదటి సారిగా మళియాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో మంచి పాత్రలో కనిపిస్తున్నారు.  ఇక అందాల భామలు సమంత, నిత్యా మీనన్ లు స్పెషల్ ఎట్రాక్షన్. సంగీతం రాక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ అందిస్తున్నారు. 
Image result for janatha garage
ప్రివ్యూ కథ : ఈ సినిమాలో ప్రకృతి మనకు ఎంత మేలు చేస్తుంది..ప్రకృతిని కాపాడి ప్రేమించే వ్యక్తిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు..ఇక సొసైటీలో జనాలకు ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ వారి బాధలు పంచుకునే వ్యక్తిగా మోహన్ లాల్ వీరిద్దరికీ ప్రకృతి లోని చెట్లకు ఉన్న సంబంధం ఏమిటీ..అసలు జనతా గ్యారేజ్ లోకి ఎన్టీఆర్ ఎలా ఎంట్రీ ఇస్తారు..నిత్యా మీనన్, సమంతలకు ఎన్టీఆర్ కి గల సంబంధం ఏంటీ అనేది ఈ చిత్రంలో అసలు కథ..ఇక జనతా గ్యారేజ్ అంటే ఏమిటీ ఇక్కడ వాహనాలతోపాటు మనుషులను కూడా రిపేర్ చేస్తారా..అందుకే జనతా గ్యారేజ్.. ఇక్కడ అన్నీ రిపేర్లు చేయబడును అని ఎందుకు అన్నారూ..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Image result for janatha garage

సినిమాలో హైలెట్స్ :
మోహన్ లాల్, ఎన్టీఆర్ నటన
సమంత గ్లామర్
దేవీ శ్రీ ప్రసాద్ రాక్ మ్యూజిక్
కొరటాల దర్శకత్వం



మరింత సమాచారం తెలుసుకోండి: