గత సంవత్సరం శ్రీమంతుడు చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో మంచి జోష్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రంపై విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ చిత్రం గనక హిట్ అయితే ఈ ఇద్దరీ హ్యాట్రిక్ విజయం సాధించినట్లే అంతే కాదు ఇద్దరు కూడా టాప్ పోజీషన్లోకి వెళ్లిపోవడం ఖాయం. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో వేడుకు మంచి సక్సెస్ అయ్యింది..అంతే కాదు ట్రైలర్ కూడా రికార్డుల మోత మోగించింది. ఎన్టీఆర్ పుట్టిన రోజున విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా మంచి క్రేజ్ సంపాదించాయి.
Image result for janatha garage
ఇందులో హీరోయిన్లు సమంత, నిత్యామీనన్ తమ అందాలతో బాగా ఆకట్టుకున్నారు. చిత్రంలోని పాటలు కూడా అద్భుతంగా వచ్చాయని కొరియోగ్రఫీ కూడా అదిరిపోయిందని ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ అన్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించారని అద్భుతంగా నటించారని అన్నారు.  ఇక సంగీతం విషయానికి వస్తే దేవీ శ్రీ ఇదివరకటి సినిమాల కన్నా కాస్త ఎక్కువ శ్రమించి కంపోజ్ చేశారని ఒక్క పాట మినహా అన్ని పాటలు సందర్భానుసారంగా వస్తాయని అన్నారు.
Image result for janatha garage
ఇప్పటికే బృందావనం, రామయ్య వస్తావయ్యా, రభస లాంటి చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్,సమంత ఇప్పుడు నాలుగవసారి జంటగా కనిపించబోతున్నారు. ఈ చిత్రంపై వస్తున్న టాక్ చూస్తే మొదటి రోజు 20 కోట్ల క్లబ్ లో చేరాటని టార్గెట్ పెట్టుకున్నట్లు చిత్ర యూనిట్ తెలుపుతుంది..ఇక 31 నైట్ బెనిఫిట్ షో ఉండబోతుంది. నందమూరి ఫ్యాన్ సినిమా ఎపుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు..మరోవైపు సినిమా లో డైలాగ్స్ లీక్ అయ్యాయని వార్తలు వస్తున్నాయి. 


ఆకలేస్తే అన్నం పెట్టే అమ్మా..భయం వేస్తే తోడుగా నడిచే నాన్న లేకపోతే..ఎలా ఉంటుందో తెలుసా..మనిషికి అంతకు మించిన నరకం ఉండదు


ఈ గ్యారేజ్ జోలికి వస్తే..ఒక్కొక్కడి బాడీలు కృష్ణా బ్యారేజ్ లో తేలుతాయ్..


అన్న గ్యారేజ్ జోలికి వస్తే ..ఒక్కొక్కడి బాడీలు కృష్ణా బ్యారేజ్ లో తేలుతాయ్..


అన్న గ్యారేజ్ లు మాత్రమే కాదు..అమ్మయిల హార్ట్ లు రికవరీలు కూడా చేస్తాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: