‘జనతా గ్యారేజ్’ ని 100 కోట్ల సినిమాగా మార్చడానికి జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు.  ఈసినిమా ఫలితం పై జూనియర్ భవిష్యత్ ఆధారపడి ఉండటంతో పెద్ద పత్రికల దగ్గర నుంచి చిన్న పత్రికల వరకు ఏ మీడియా సంస్థను వదలకుండా ఎక్కడ చూసినా విన్నా ‘జనతా గ్యారేజ్’ హోరెత్తిస్తున్నాడు జూనియర్.

ఈ సందర్భంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ తన బాబాయ్ బాలకృష్ణ పై అదేవిధంగా దక్షిణాది సినిమా రంగ సూపర్ స్టార్ రజినీకాంత్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు జూనియర్.  తన కుటుంబంలోని తన తండ్రి హరికృష్ణ తన బాబాయ్ బాలకృష్ణలకు ఉన్న సెంటిమెంట్స్ పై  మాట్లాడుతూ తన బాబాయ్ నమ్మకాల మీద కామెంట్స్ చేసే అంత పెద్దవాడిని కాదు అంటూ సెంటిమెంట్ కన్నా హార్డ్ వర్క్ పై తనకు నమ్మకం అని అంటూ తన బాబాయ్ బాలకృష్ణ ఈ వయసులో కూడ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా కోసం పడుతున్న కష్టం చూస్తూ ఉంటే తనకు ఆశ్చర్యం కలుగుతోంది అంటూ కామెంట్స్ చేసాడు.

ఇక తన కెరియర్ లో ఏ డైరెక్టర్ తోను తనతో ఒక సినిమా చేయండి అంటూ తనకు తాను ఏ టాప్ డైరెక్టర్ తోను పైరవీలు నడపలేదని తన వ్యక్తిగత జీవితాన్ని సినిమా జీవితాన్ని ఎప్పుడూ తాను కలుపుకోనని అంటూ అనుబంధాలు వేరు జీవితాలు వేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

ఇక తాను ఏ విషయాన్ని చాలామందిలా ప్లాన్ చేసుకోనని అప్పటికప్పుడు ఆలోచించి తాను ఒక నిర్ణయం తీసుకుంటాను అన్న విషయాన్ని బయట పెట్టాడు జూనియర్.  తన 33 ఏళ్ల జీవితంలో తాను ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను అని జూనియర్ చేసిన కామెంట్ వెనుక రాజకీయాలలో జూనియర్ కు ఎదురైన ఎదురు దెబ్బలు ప్రస్తావిస్తూ ఇలా వ్యూహాత్మకంగా తారక్ కామెంట్ చేశాడా ? అనిపించడం సహజం.  

ఇదే సందర్భంలో తనకు తన బాబాయ్ బాలకృష్ణ కు మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ తాము ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం అని కామెంట్ చేస్తూ ఒకసారి ఫ్యామిలీ ఇంటర్వ్యూ ఇస్తేకాని ఈ సమస్యలు తీరిపోవు అని సెటైర్ వేసాడు జూనియర్.  ఈ  కామెంట్ చేయడం బట్టి మీడియాలో తనకు బాలయ్యకు మధ్య చిచ్చు రగిల్చే వార్తల గురించి తారక్ ఎంత సీరియస్ గా ఆలోచిస్తున్నాడో అర్ధం అవుతుంది.

‘జనతా గ్యారేజ్’ సినిమాను కోలీవుడ్ లో కూడ బాగా ప్రమోట్ చేసి విడుదల చేస్తున్న నేపధ్యంలో కొన్ని మీడియా వర్గాలు ‘కబాలి’ సినిమా కంటే స్పెషల్ షోస్ సంఖ్యలో ‘జనతా గ్యారేజ్’ మించి పోతోంది అన్న విషయం పై స్పందిస్తూ జూనియర్ రజినీకాంత్ పై కొన్ని కామెంట్స్ చేసాడు.  సూపర్ స్టార్ రజినీకాంత్ ఇమేజ్ పరంగా 1000 మెట్ల స్థానంలో టాప్ లో నిలిస్తే తాను ఇంకా మొదటి మెట్టులోనే ఉన్నాను అని అంటూ తనకు రజినీకాంత్ కు ‘నక్కకు నాగలోకానికి’ ఉన్నంత తేడా ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు జూనియర్..


మరింత సమాచారం తెలుసుకోండి: