తెలుగు ఇండస్ట్రీలో నందమూరి తారకరామారావు ఎంతో గొప్ప నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి అక్కడకూడా తన సత్తా చాటాడు. తెలుగువారి గౌరవాన్ని నలు దిశలా చాటి చెప్పిన మహానుభావులు. ఆయన తర్వాత ఇండస్ట్రీలోకి బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు..అప్పట్లో బాలకృష్ణ, ఎన్టీఆర్ చిత్రాలు కూడా బాగానే వచ్చాయి.  సాంఘిక,పౌరాణిక,జానపద చిత్రాల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు..గత కొంత కాలంగా ఫ్యాక్షన్ తరహా చిత్రాల్లో నటిస్తూ సింహా,లెజెండ్, లయన్ లాంటి సినిమాలతో హిట్స్ సాధించారు..ఇక బాలకృష్ణ తర్వాత నందమూరి హరికృష్ణ తనయుడు ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి..తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదించారు. డ్యాన్స్, ఫైట్స్ తో నేటి యువతకు బాగా కనెక్ట్ అయ్యారు ఎన్టీఆర్. గత సంవత్సరం టెంపర్ చిత్రంతో నెగిటీవ్, పాజిటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ తో అద్భుతనటన కనబరిచారు ఎన్టీఆర్.  
Image result for janatha garage
ఈ సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో చిత్రంలో డిఫరెంట్ గెటప్ లో చాలా స్టైలిష్ గా కనిపించారు. ఈ చిత్రం కూడా అద్భుత విజయం సాధించింది. ఇక శ్రీమంతుడు చిత్రంతో సెన్సేషన్ విజయం సాధించిన కొరటాల దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో నటించారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ప్రీమియం షోలు పడ్డాయి..ఈ మేరకు థియేటర్ల వద్ద నందమూరి ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్ భారీ ఎత్తున వచ్చారు.
Image result for janatha garage
ఇక సినిమా విషయానికి వస్తే మొదట్లో కాస్త సాగదీసినట్లు అనిపించినా మళియాల సూపర్ స్టార్ మోహన్ లాల్ అద్భుతంగా నటించినట్లు టాక్. ఇక సినిమాలో రివేంజ్, భావోద్వేకాలు, సెంటిమెంట్..హీరోయిన్ల గ్లామర్ ఎన్టీఆర్ నటన, ఫైట్స్ బాగున్నాయని అంటున్నారు. సినిమా పరంగా చూస్తే ఓ వైపు మెసేజ్ ఇస్తూనే..పగా ప్రతీకారం తో సినిమా కొన్ని చోట్లు బోరింగ్ సీన్లతో సాగిపోయిందని అంటున్నారు. ఏది ఏమైనా ప్రీమియం షో చూసిని వారు  సినిమాపై మిక్స్ డ్ టాక్ వస్తున్నా..సినిమా థియేటర్లో జనాలు ఎలా తీర్పు ఇస్తారో వేచి చూడాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: