‘జనతా గ్యారేజ్’ ప్రమోషన్ లో బిజీగా ఉంటూ ఈ సినిమా రిజల్ట్ గురించి ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషనల్ వ్యవహారాలు చూస్తూనే వక్కంతం వంశీకి ఊహించని షాక్ ఇవ్వడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.  జూనియర్ ఎన్టీఆర్ కి సన్నిహితుడుగా పేరు గాంచిన వక్కంతం వంశీ గతంలో జూనియర్ నటించిన ఎన్నో సినిమాలకు కథలు అందించిన విషయం తెలిసిందే.

అయితే ఎప్పటికైనా జూనియర్ సినిమాకు దర్శకత్వం వహించి తాను దర్శకుడుగా మారాలని గత రెండు సంవత్సరాలుగా కలలు కంటున్నాడు వక్కంతం వంశీ.  ఆమధ్య తాను దర్శకత్వం వహించాలని తయారు చేసుకున్న ‘టెంపర్’ సినిమా కథను పూరీజగన్నాథ్ కు త్యాగం చేయడంతో డానికి ప్రతిఫలంగా అయినా జూనియర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించి  తీరుతాడు అని అనుకున్నారు అంతా.

అయితే దీనికితోడు కళ్యాణ్ రామ్ నిర్మాతగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమాను చేయడానికి రంగం సిద్ధం కావడమే కాకుండా ఆ మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ‘జనతా గ్యారేజ్’ విడుదలైన వెంటనే ఉంటుంది అని ఆశిస్తున్న వంశీకి జూనియర్ ఊహించని షాక్ ఇచ్చాడు అన్న వార్తలు వస్తున్నాయి.  

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం జూనియర్ వక్కంతం వంశీల మూవీ ప్రాజెక్ట్ అటకెక్కింది అన్న వార్తలు వస్తున్నాయి.  దీనికి కారణం వక్కంతం వ్యవహార శైలి అని అంటున్నారు. వంశీ జూనియర్ ను అడగకుండా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ‘ధడ్కన్’ టైటిల్ ను రిజిస్టర్ చేయడమే కాకుండా ఆ టైటిల్ కు సంబంధించిన లీకులు బయటకు వదలడం జూనియర్ కు కోపం తెప్పించింది అని టాక్.

అయితే జూనియర్ వక్కంతంకు ఇలాంటి ఊహించని షాక్ ఇవ్వడం వెనుక మరొక కారణం ఉంది అని అంటున్నారు.  ఈమధ్య అమెరికాకు చెందిన ఒక ప్రముఖ ఎన్ఆర్ఐ జూనియర్ కలిసి తాను వరసగా రాబోయే రెండు సంవత్సరాల లోపు 3 సినిమాలు తీసే ఉద్దేశ్యం ఉందని దీనికి పారితోషికంగా ఈ మూడు సినిమాలకు కలిపి 60 కోట్ల భారీ పారితోషికాన్ని ఆఫర్ చేయడంతో జూనియర్ ఆలోచాలలో మార్పు వచ్చి వక్కంతం కథను పక్కకు పెట్టాడు అన్న వార్తలు కూడ ఉన్నాయి.

దీనికితోడు జూనియర్ లేటెస్ట్ గా ఇస్తున్న ఇంతర్వ్యులలో ‘జనతా గ్యారేజ్’ విడుదల తరువాత తాను కొంత కాలం కొత్త సినిమాల విషయంలో కొంత విరామం తీసుకుని అడుగులు వేయాలి అని ఆలోచిస్తున్నట్లు చెప్పిన నేపధ్యం కూడ వక్కంతం వంశీకి తీవ్ర నిరాశ కలిగించినట్లు టాక్.  దీనితో వక్కంతం తనకు కథకు సరిపోయే మరో హీరోని వెతుక్కునే పని అప్పుడే మొదలు పెట్టేసాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ‘జనతా గ్యారేజ్’ ఫలితం బట్టి జూనియర్ ఆలోచనలలో అనేక మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: