మిలియన్ మార్క్ ను దాటేసిన ‘జనతా గ్యారేజ్’


ఎన్టీఆర్ మూవీ ‘జనతా గ్యారేజ్’ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మొదటిరోజే ప్రీనియర్ల ద్వారా దాదాపు $592,000 కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా మొదటిరోజు వచ్చిన పాజిటివ్ టాక్ తో 2వ రోజు కూడా అదే ఊపు కొనసాగించి 3వ రోజుకి మిలియన్ మార్క్ ను క్రాస్ చేసేసింది. దీంతో ఎన్టీఆర్ కెరీర్లోనే అతిపెద్ద గ్రాసర్ గా ఈ చిత్రం నిలిచింది. అంతేగాక తెలుగు రాష్ట్రాల్లో సైతం మంచి క్రేజ్ తో నడుస్తున్న ఈ సినిమా రెండవరోజుకి రూ.25. 76 కోట్ల వసూళ్లు సాధించి బయ్యర్లంతా సేఫ్ జోన్లోకి వెళ్లేలా చేసింది. 


మహేష్ – మురుగదాస్ సినిమా విడుద‌ల‌కు డేట్ ఫిక్స్


మ‌హేష్ - ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేష‌న్‌లో చేస్తున్న మూవీ గత నెల్లో సెట్స్‌పైకి వెళ్ళింది. ఈ సినిమా ప్ర‌స్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఓ సోషల్ మెసేజ్ ఉన్న కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు తెలియజేస్తూ, సెప్టెంబర్ నెలలో చెన్నైలో ఓ భారీ షెడ్యూల్ జరుగనుందని, డిసెంబర్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యేలా ప్లాన్ చేసినట్లు దర్శకుడు మురుగదాస్ తెలిపారు. అదేవిధంగా వేసవి సీజన్లో ఏప్రిల్ నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నామని మురుగదాస్ స్పష్టం చేశారు. 


నాగార్జున ‘నిర్మలా కాన్వెంట్’ విడుద‌ల తేదీ

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ కింగ్ అక్కినేని నాగార్జున ‘నిర్మలా కాన్వెంట్’ అనే ఆసక్తికర టైటిల్‌తో ఓ టీనేజ్ లవ్‌స్టోరీని నిర్మించిన విషయం విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపుగా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర‌యూనిట్ తెలిపింది. 


చైతూతో జతకట్టనున్న రకుల్  

టాలీవుడ్ లో రామ్ చరణ్ సరసన ‘ధృవ’, మహేష్ – మురుగదాస్ ల కొత్త సినిమాల్లో నటిస్తున్న ర‌కుల్ ప్రీతి త్వరలో స్టార్ హీరో నాగ చైతన్య హీరోగా ప్రారంభంకాబోతున్న సినిమాలో హీరోయిన్ గా అవ‌కాశం దక్కించుకుంది. ఈ సంవత్సరం రకుల్నటించిన ‘నాన్నకు ప్రేమతో, సరైనోడు’ చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇకపోతే ఈ చిత్రాన్ని నాగార్జునతో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి బ్లాక్ బస్టర్ తీసిన కళ్యాణ్ కృష్ణ డైరెక్ చేయనున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం నాగ చైతన్య ‘ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.


పట్టాలెక్కబోతున్న వెంకీ రీమేక్ చిత్రం

వెంక‌టేష్ కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు.  బాలీవుడ్ చిత్రం సాలా ఖడూస్ కి రీమేక్ గా వెంకీ తదుపరి సినిమా రూపొందనుంది. ఒరిజినల్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన సుధా కొంగర, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఇక ఒరిజినల్ వెర్షన్ లో నటించిన రితికా సింగ్ రీమేక్ లోను అదే పాత్రను పోషించనుంది. వెంకటేష్ రీమేక్ చేయబోవు సినిమాను సెప్టెంబర్ 10వ తేదీన ఆరంభించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ బాక్సింగ్ కోచ్ లా కనిపించనున్నాడు అయితే ఈ చిత్రం కోసం వెంకటేష్ బారీగా కండలు పెంచే ప్రయత్నంలో ఎక్సర్ సైజ్ లు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. 


రవితేజ మూవీకి ముహూర్తం 

రవితేజ  బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇదే సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించినట్టుగా సమాచారం. ఈ నెల 26న ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారట. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెడతారని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: