'నక్షత్రం' తొలి 10 ప్రచారచిత్రాలను రిలీజ్ చేయనున్న రామ్ చరణ్


నక్షత్రం  మూవీ  ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఈ చిత్రం తొలి 10 ప్రచార చిత్రాలను మరికొద్ది రోజులలో విడుదల చేయనున్నారు రామ్ చరణ్. డైరెక్ట‌ర్ కృష్ణవంశీ తెర‌కెక్కిస్తున్న‌ 'నక్షత్రం' లోగో, ట్రైల‌ర్స్ ఎంతో ఆసక్తిని రేకెత్తించేలా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. "పోలీస్" అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ "నక్షత్రం" అని తెలిపారు దర్శకుడు కృష్ణవంశీ.


టీచర్లను కించపర్చేలా వర్మ ట్వీట్లు 


డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ ఉపాధ్యాయుల దినోత్సవమైన (సెప్టెంబర్ 5) ఉపాధ్యాయులపైనే తనదైన శైలిలో స్పందించాడు. వర్మ ట్వీట్ల సారాంశంల్లోకి వెళితే.. స్కూల్లో టీచర్లతో సమయం వృథా చేసుకోవద్దనీ, కేవలం గూగుల్ నుంచే నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించాడు. అంతేగాక, తాను టీచర్లందర్నీ ద్వేషించేవాడిననీ, అందుకే క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూడటం వల్ల తాను ఇంత పెద్ద దర్శకుడినయ్యానంటూ తన గొప్పలు చెప్పుకున్నాడు 

అమెరికా అబ్బాయి .. తెలంగాణ అమ్మాయికి మధ్య ఫిదా 


వరుణ్ తేజ్ .. సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'ఫిదా' రూపొందుతోంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ‌లో క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇంతవరకూ 40 శాతం చిత్రీకరణను పూర్తిచేసినట్టుగా చెబుతున్నారు.  అమెరికా అబ్బాయి .. తెలంగాణ అమ్మాయికి మధ్య చోటుచేసుకునే ప్రేమకథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది.  


నిన్నేపెళ్లాడుతా అంటున్న‌నాగ‌చైత‌న్య‌


నాగార్జున న‌టించిన ఓ హిట్ సినిమా టైటిల్‌పై త‌న‌యుడు నాగ‌చైత‌న్య‌ మ‌నసు ప‌డుతున్నాడు. నాగార్జున కెరీర్లో సూప‌ర్ హిట్ట‌యిన‌ 'నిన్నే పెళ్లాడుతా'  సినిమా టైటిల్ ను తాను చేయనున్న చిత్రానికి పెట్టుకోవాలని చైతూ భావిస్తున్నాడు. 'సోగ్గాడే చిన్ని నాయన' ఫేం కల్యాణ కృష్ణ దర్శకత్వంలో త్వరలో చైతన్య చేయనున్న చిత్రానికి ఈ 'నిన్నే పెళ్లాడుతా' టైటిల్ని పెట్టనున్నారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: