Mr. Pellikoduku: తెలుగు ట్వీట్ రివ్యూ || Tweet Review || English Full Review

  సునీల్ హీరోగా నటించిన మరో సినిమా ‘Mr. పెళ్లికొడుకు’. హిందీలో విజయవంతమైన ‘తనూ వెడ్స్ మనూ’ రీమేక్ గా రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇషాచావ్లా జంటగా నటించిన ఈ ‘Mr. పెళ్లికొడుకు’ ఎలా ఉన్నాడో చూద్దాం...!   చిత్రకథ :     అమెరికాలో బోటిక్ గా పని చేసే బుచ్చిబాబు [సునీల్] పెళ్లి చేసుకోవడానికి స్వదేశం ఇండియా తిరిగివస్తాడు. తల్లిదండ్రులు చూపించిన అమ్మాయిల్లో మొదటిసారి చూసిన అమ్మాయినే [ఇషాచావ్లా]  ఇష్టపడతాడు. పెళ్ళి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే ఆ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటుందని తెలుసుకుని వారిద్దరికీ వివాహం చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే చివరికి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.   నటీనటుల ప్రతిభ :     హీరోగా రాణించాలని ప్రయత్నిస్తున్న సునీల్ ఈ సినిమా కోసం చాలా శ్రమపడ్డాడు. కష్టపడి డాన్సులు చేశాడు. కండలు పెంచి ఫైటింగ్ చేశాడు. సినిమా కూడా సునీల్ చుట్టూనే సాగుతుంది. సునీల్ కోసంమే పాటలు వస్తాయి. సునీల్ సిక్స్ ప్యాక్ చూపడానికే చివరిలో ఫైట్ సీన్ పెట్టినట్లు ఉంది. అయితే సునీల్ ప్రధాన బలమైన కామెడీ సీన్లు ఈ చిత్రంలో తక్కువ. పైగా సునీల్ ను ఎమోషనల్ సీన్లు చూడ్డం కష్టంగా అనిపించింది. ఇషాచావ్లా తన పాత్ర పరిధిలో నటించింది. గుర్తుపెట్టుకునే ప్రాముఖ్యత ఇషాచావ్లా కు లేదు. అలీ, ఎమ్మెస్ నారాయణ నవ్వించడానికి ప్రయత్నించారు. మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు :   ఫోటోగ్రఫీ ఫర్వాలేదనిపిస్తుంది. పాటలు టైమ్ కు వచ్చి మేము ఉన్నామని గుర్తుచేస్తుంటాయి. గుర్తుపెట్టుకోవాల్సిన సంభాషణలు ఈ సినిమాలో లేవు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సునీల్ ను హీరోగా నిలబెట్టడానికే దర్శకుడు కష్టపడ్డాడు. సాధారణమైన కథను తీసుకుని దానికి ట్విస్ట్ లు జోడించి, సునీల్ డాన్సుల ప్రతిభను ఉపయోగించుకుని సినిమా నడిపి సునీల్ సిక్స్ ప్యాక్ ఫైట్ తో సినిమాను ముగించాడు. రాజమండ్రి రైల్వే స్టేషన్, షాపింగ్ కాంప్లెక్స్ లో కామెడీ సీన్లు బాగా వచ్చినా, సినిమాలో మిగతా చోట్ల స్ర్కీన్ ప్లే సరిగ్గా కుదరకపోవడంతో చాలా సన్నివేశాలు బోర్ గా సాగుతాయి. సినిమా ఎప్పుడు ముగింపునకు వస్తుందా అనే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. హైలెట్స్ :
  • సునీల్ డాన్సులు

  • రెండు కామెడీ సీన్లు
డ్రాబ్యాక్స్ :
  • స్క్రీన్ ప్లే

  • సునీల్ కు సరిపడని ఎమోషనల్ సీన్లు

  • బోర్ కలిగించే దృశ్యాలు ఎక్కువగా ఉండటం
   విశ్లేషణ : బాలీవుడ్ లో విజయంతమైన ‘తనూ వెడ్స్ మనూ’ హీరోయిన్ ప్రధానంగా సాగుతుంది. ఈ సినిమాను మల్టీ ఫ్లెక్స్ ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించారు. అయితే తెలుగు లోకి వచ్చేసరికి ఈ సినిమా హీరో ప్రధానంగా సాగుతుంది. సునీల్ చుట్టూ నడుస్తుంది. దీంతో సినిమా క్లాస్ నుంచి మాస్ కు మళ్లింది. ఈ కారణాలుతో పాటు మల్టీఫ్లెక్స్ సినిమా కాకపోవడం, ‘తనూ వెడ్స్ మనూ’ రీమేక్ కావడం.. వంటి కారణాలతో మల్టీ ఫ్లెక్స్ లోనూ, ఎ సెంటర్లలోనూ ‘Mr. పెళ్ళికొడుకు’ నిలబడ్డం కష్టం. అయితే, ‘తనూ వెడ్స్ మనూ’ తెలియకపోవడం-సునీల్ డాన్సులు వంటి కారణాలతో బి,సి సెంటర్లలో ‘మిస్టర్ పెళ్లి కొడుకు’కు ఆదరణ దక్కే అవకాశం ఉంది. చివరగా :     ‘Mr.పెళ్లికొడుకు’ ప్రేక్షకుల కోసం వెతుక్కోవాలి.

MR. Pellikoduku Review: Cast & Crew

   

More Articles on Mr. Pellikoduku || Mr. Pellikoduku Wallpapers || Mr. Pellikoduku Videos


 

మరింత సమాచారం తెలుసుకోండి: