సినిమా ఇండస్ట్రీ అనగానే సెలబ్రెటీలు వారికి ఇచ్చే గౌరవం అంతా ఇంతా ఉండదు..ఎక్కడకి వెళ్లినా అభిమానలతో కోలాహలంగా ఉంటుంది.  ఒక్కోసారి వారి తాకిడికి తట్టుకోలేక సెక్యూరిటీ కూడా నానా తంటాలు పడుతుంటారు. అలాంటిది ఓ హీరోయిన్ ని  సూపర్ మార్కెట్ నిర్వాహకురాలు ఘోరమైన అవమానం చేసింది..అయితే అది ఇక్కడ కాదు లేండీ. అమెరికాలోని  నల్ల జాతి కి చెందిన హాలీవుడ్ హీరోయిన్ , సింగర్ అయిన జెండయ కోలేమన్ అవమానం జరిగిందంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తూంది. వివరాల్లోకి వెళితే..అమెరికాలో నల్ల జాతీయుల పట్ల శ్వేత జాతీయులు అహంకార పూరిత వైఖరి ప్రదర్శిస్తుంటారు. గత కొంత కాలంగా ఇలాంటి విద్వేశాలు చాలా చోటు చేసుకున్నాయి.
Image result for zendaya coleman
ఈ మద్య జెండయ కోలేమన్ ఉత్తర అమెరికాలోని ఓన్స్ సూపర్ మార్కెట్ లోకి వెళ్లి తనకు కావలసిన వస్తువులను తీసుకుంది.  తర్వాత తనకు కావాల్సిన ఓ వస్తువు తీసుకోగా కోలేమన్ నల్ల జాతీయురాలు కావడంతో నీ లాంటి వాళ్ళు తీసుకునే వాలెట్ ఇది కాదు అంటూ విసిరి కొట్టిందట సదరు సూపర్ మార్కెట్ నిర్వాహకురాలు దీంతో ఒక్కసారే అవాక్కైంది కొలేమాన్..అందరి ముందు అలా అవమానించడంతో ఏం చేయాలో పాలుపోలేదట.  
Image result for zendaya coleman
తాను ఒక సెలబ్రెటీ అని అయినా  ఇప్పటికి కూడా ఇంకా నల్ల జాతీయుల పట్ల వివక్ష కొనసాగుతోందని,  నేను నల్ల జాతికి చెందినా దాన్ని అయినంత మాత్రాన అవి కొనే అర్హత లేదా ? అంటూ మండిపడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: