ప్రేక్ష‌కుల ముందుకు 'జ్యో అచ్యుతానంద' 

దర్శకుడిగా మారి మొదటి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్, తాజాగా ‘జ్యో అచ్యుతానంద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. పాజిటివ్ టాక్ రావ‌డంతో అంద‌రి దృష్టి ఈ సినిమా వ‌సూళ్ల‌పై ప‌డింది. 


'జ్యో అచ్యుతానంద' గురించి రాజమౌళి

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జ్యో అచ్యుతానంద' సినిమాను చూసి డైరెక్ట‌ర్ రాజమౌళి స్పందించాడు. అవసరాల శ్రీనివాస్ ఈ సినిమా కథ,  కథనాలను సమర్ధవంతంగా నడిపించాడని అన్నారు. ప్రతి పాత్రను ఆయన చక్కగా తీర్చిదిద్దాడని చెప్పారు. నారా రోహిత్ .. నాగశౌర్య తమ పాత్రల పరిధిలో చాలా సహజంగా నటించారని అన్నారు. ఇక రెజీనా నటనను తాను ఫస్ట్ టైమ్ చూశాననీ .. అద్భుతంగా నటించిందని చెప్పారు. ఈ సినిమాకి కాంబినేషన్ బాగా కుదిరిందనీ, ఈ సినిమా తనకి బాగా నచ్చిందన్నారు. 


తండ్రితో కలిసి డ్యాన్స్‌ చేసిన ప్రభుదేవా 


డైరెక్ట‌ర్, డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌, యాక్ట‌ర్ ప్రభుదేవా తన తండ్రి ముగుర్‌ సుందర్‌తో కలిసి డ్యాన్స్‌ చేశారు. వీరిద్దరూ కలిసి ఒకే స్క్రీన్‌పై కనపడటం అరుదుగా చూస్తుంటాం. అలాంటిది ఓ ప్రైవేటు ఛానెల్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇండియన్‌ మైఖెల్‌ జాక్సన్‌ ప్రభుదేవా తన తండ్రితో కలిసి స్టెప్పులేశారు. ‘నేను, నాన్న... అద్భుతమైన క్షణాలు, ఎన్నటికీ మర్చిపోలేను’ అని ప్రభుదేవా ట్వీట్‌ చేశారు. 


సెప్టెంబర్‌ 23న నాని ‘మజ్ను’

యంగ్ హీరో6 నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో చేస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మజ్ను’. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 23న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.


ఆడియ‌న్స్ ముందుకు 'బార్ బార్ దేఖో' 
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ 'బార్ బార్ దేఖో తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: