పాత తరం సినిమా ప్రపంచాన్ని శాసించిన మహానటులు తెలుగులో ఎన్టీఆర్,ఏఎన్ఆర్ లు అయితే తమిళంలో ఎంజీఆర్, శివాజీగణేషన్.  ఆ కాలంలోనే పోటా పోటీగా నటించిన వీరు ఆయా ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా చెలామణి అయ్యారు. అయితే  అప్పట్లో కొన్ని సినిమాలు తెలుగు నుంచి తమిళంలోకి రిమేక్, డబ్ కావడం తమిళం చిత్రాలు తెలుగు లో డబ్ కావడం జరుగుతుండేవి. కొన్ని సందర్భాల్లో అగ్ర హీరోలు ఒకే వేదికపై కలుస్తూ క్షేమ సమాచారాలు తెలుసుకునే వారు.
 
 తమిళనాడు ఆరాధ్య దైవంగా చూసే ఎంజీఆర్.. తెలుగులో నటసార్వ భౌములుగా కీర్తించబడిన ఎన్టీఆర్ లు మంచి మిత్రులు. అప్పుడప్పుడు షూటింగ్స్ సమయంలో వీరు కలుస్తుండే వారు.

అప్పట్లో ఎక్కువ   స్టూడియోలు మద్రాసులోనే ఉండేవి కనుక షూటింగ్ కూడా అక్కడే ఎక్కవ తీసేవారు. ఆ సమయంలో ఈ హీరోలు  తరుచూ కలుస్తుండే వారు. ఎన్టీఆర్ నటించిన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన దాన వీర శూర కర్ణ చిత్రం షూటింగ్ సందర్భంగా ఎన్టీఆర్, ఎంజీఆర్ కలిసి తీయించుకున్న అపురూప చిత్రం మీకోసం..!


మరింత సమాచారం తెలుసుకోండి: