తెలుగు ఇండస్ట్రీలోకి నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్ గత కొంత కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో పూరీజగన్నాధ్ దర్శకత్వంలో ‘టెంపర్ ’చిత్రంతో  మంచి హిట్ కొట్టాడు. ఈ చిత్రంతో ఎన్టీఆర్ రెండు విభిన్నమై షేడ్స్ లో కనిపించాడు. ఒకటి మొదటి భాగమంతా నెగెటీవ్ కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ గా ఆ తర్వాత రౌడీల భరతం పట్టడానికి తనను తానే ఆర్పించుకునే అసలైన పోలీస్ ఆఫీసర్ గా అద్భుతమైన నటన కనబరిచాడు. ఇక ఈ సంవత్సరం సుకుమార్ దర్శకత్వం వహించిన నాన్నకు ప్రేమతో చిత్రం మరో అద్భుత విజయం సాధించింది. అయితే ఈ చిత్రంతో ఎన్టీఆర్ చాలా మార్పులు వచ్చాయి.
Image result for అనిల్ రావిపూడి
నటనలో పూర్తి పరిపక్వత కొత్తదనం కనిపించింది అంతే కాదు లుకింగ్ లో కూడా చాలా డిఫరెంట్ గా స్టైలిష్ గా కనిపించాడు.  ఒక రకంగా చెప్పాలంటే ‘నాన్న‌కు ప్రేమ‌తో’ సినిమా ద‌గ్గ‌ర‌నుంచి య‌న్టీఆర్ ఆలోచ‌న‌లు మారాయి.  అందుకే ‘జ‌న‌తా గ్యారేజ్’ త‌రువాత వ‌క్కంతం వంశీ చెప్పిన  రెగ్యుల‌ర్ మాస్ స్టోరిని, పూరీ జ‌గ‌న్నాథ్ తో చేయాల‌నుకున్న రొటీన్ యాక్ష‌న్ మూవీని ప‌క్కన పెట్టి అనిల్ రావిపూడి చెప్పిన క‌థ‌లోని డిఫ‌రెంట్ కేర‌క్ట‌ర్ ను చేయాల‌ని ఫిక్సైపోయిన‌ట్టు తెలుస్తోంది.
Image result for ntr sukumar
అంతా బాగుంది కానీ ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటించే పాత్ర గురించి తెలిస్తే అంతా షాక్ అవుతారు..అవును ఎన్టీఆర్ గుడ్డివాడి పాత్రలో నటించబోతున్నారట. త్త‌ద‌నం కోరుకుంటున్న య‌న్టీఆర్ నిజంగా గుడ్డివాడిగా న‌టిస్తాడా అన్న‌ది పక్కన బెడితే మంచి స్టార్ ఇమేజ్ వచ్చిన ఈ సమయంలో అలాంటి హీరోల నుంచి అభిమానుల కమర్షియల్ ఎలిమెంట్స్ చూస్తారు.
Image result for janatha garage
ఈ సమయంలో ఇలాంటి పాత్రలు చేసి ఎంత వరకు మెప్పించగలరని అందరూ అనుకుంటున్నారు. ఒక వేళ కొత్త‌గా ఉంటుంద‌ని ఎన్టీఆర్ చేయ‌డానికి ముందుకొస్తే మాత్రం నిజంగా ఇదొక ప్ర‌యోగ‌మ‌నే చెప్పాలి.   అనిల్ రావిపూడి చెప్పిన క‌థ‌లోని దమ్ముంటే ఎన్టీఆర్ పాత్ర చేస్తే దిల్ రాజు లాంటి ప్రొడ్యూస‌ర్ మరి సినిమాపై అంచనాలుకూడా భారీ స్థాయిలో ఉంటాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: