తెలుగు ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతున్న సమయంలో స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు రెండవ తనయుడు వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.  మొదటి కుమారుడు సినిమా ఇండస్ట్రీలోనే ఉంటూ తండ్రి మార్గంలో వెళ్లారు. సురేష్ ప్రొడక్షన్ పై ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఈయన కుమారుడు రానా కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఎత్తు, పర్సనాలిటీ ఉన్న రానా మొదటి చిత్రం ‘లీడర్’ తో ఎంట్రీ ఇవ్వడంతో మనోడి ఏ యాంగిల్ హీరో చూడాలో జనాలకు అర్థం కాలేదు. చాలా మంది హీరోలు మాస్ ఎలిమెంట్స్ తో ఉన్న చిత్రాలతో ఇంట్రడ్యూస్ కావడంతో మాస్ హీరోగా గుర్తించబడతారు..కానీ రానా చాలా అఫిషియల్ గా ఓ ముఖ్యమంత్రి స్థాయిలో రాజకీయాలతో ముడిపడిన చిత్రంలో నటించారు.  
Image result for rana bahubali shooting
ఆ తర్వాత వచ్చిన చిత్రాలు కూడా పెద్ద పేరు తీసుకు రాలేదు. దీంతో మనోడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ మంచి చిత్రాల్లో నటించాడు. ఏ హీరోకి అయినా అదృష్టం కలిసి వస్తే స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా మలుపు తిప్పుతుంది. కానీ రానాకు మాత్రం విలన్ గా స్టార్ ఇమేజ్ దక్కింది. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రంలో రానాకు ప్రతి నాయకుడిగా మంచి పేరు రావడమే కాదు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక బాహుబలి చిత్రం రిలీజ్ తర్వాత రానా రెండు మూడు చిత్రాల్లో నటించాడు కానీ  ‘ఘాజీ’ అనే సినిమాను పూర్తి చేశాడు.  
Image result for rana bahubali shooting
ఇప్పటి వరకు రానా సోలోగా నటించిన సినిమాలు ఒక్కటీ తీయలేదు. ఇక బాహుబలి 2 చిత్రం షూటింగ్ కోసం మళ్లీ తన బాడీ పెంచేసి షూటింగ్ లో పాల్గొన్నాడు. అయితే ఈ షూటింగ్ రాజమౌళి ఎన్నో వ్యవప్రయాసలకు ఓర్చి కంప్లీట్ చేసినట్లు తెలుస్తుంది.  మొత్తానికి  రానాకు సంబంధించిన పార్టు షూటింగ్ పూర్తి అయినట్లేనట. దీంతో మనోడు గెడ్డం తీసేసి హ్యాపీగా తిరిగేస్తున్నాడట. ఇప్పుడు తేజ‌తో రానా కొత్త సినిమాకు రెడీఅయిపోతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: