తెలుగు చలన చిత్ర సీమలో కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు.  చిత్ర పరిశ్రమలో  మోహన్ బాబు నటించని పాత్ర లేదు..పౌరాణిక,సాంఘిక,జానపద చిత్రాల్లో నటించిన ఈయన మహానటులు ఎన్టీఆర్ మెచ్చిన నటుడు.  ఒకప్పుడు ఎన్టీఆర్ ప్రతి చిత్రంలోనూ మోహన్ బాబు ఉండాల్సిందే..అంతే కాదు మోహన్ బాబుని బ్రదర్ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేవారట.  మోహన్ బాబు కేవలం నటుడిగానే కాకుండా దర్శకులు, నిర్మాతగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా అన్ని రంగాల్లో తనదైన ప్రతిభ చూపించారు. ఇక మోహన్ బాబు ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 17న విశాఖపట్నంలోని మున్సిపల్ స్టేడియంలో భారీ వేడకు ఏర్పాటు చేశారు.
Image result for mohan babu dasari
ఈ వేడుకలో నిర్మాత, రాజకీయవేత్త అయిన టి. సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో ‘లలితా కళా పరిషత్’ మోహన్ బాబును ‘నవరస నట తిలకం’ పురస్కారంతో సత్కరించనుంది.  అయితే ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి అతిరథ మహారధులు రాబోతున్నారట. దాసరి, నాగార్జున,వెంకటేష్,సుమలత, శ్రీదేవి, జయసుధ వంటి నటులతో పాటు బాలీవుడ్ నటులు, రాజకీయ వేత్త అయిన శత్రుజ్ఞ సిన్హా ముఖ్య అతిధులుగా విచ్చేస్తున్నారు.
Image result for mohan babu nagarjuna
అయితే ఈ వేడుకు మరో ముఖ్య అతిథి గురించి ఇప్పుడు టాక్ మొదలైంది..ఆయనే మెగాస్టార్ చిరంజీవి.  టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు కి కొన్ని అభిప్రాయ బేధాలు ఉన్నాయని ఎప్పటి నుంచో రూమర్లు ప్రచారంలో ఉన్న తమకు అలాంటి ఏవీ లేవని నటన పరంగా మాత్రం మా మద్య పోటీ కానీ వ్యక్తిగతం తాము మంచి స్నేహితులమని ఇద్దరు చెప్పుకొచ్చారు.
Image result for mohan babu rajinikanth
ప్రస్తుతం చిరంజీవి ఖైదీ నెం. 150’ షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు తీరికలేకపోయినా మోహన్ బాబుతో ఉన్న స్నేహబంధంతో వీలు చూసుకొని వేడుకకు తప్పకుండా వస్తానని మాట ఇచ్చారట. వైజాగ్ చేరుకున్న మోహన్ బాబు విలేఖరులతో మాట్లాడుతూ తన ఈ సుదీర్ఘ ప్రయాణానికి కారకులైన ఆయన గురువు దాసరి నారాయణరావుకు, తన అభిమానులకు కృతఙ్ఞతలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: