థియేట‌ర్ల‌లో ‘నిర్మలా కాన్వెంట్‌’ సంద‌డి

 

నాగార్జున నిర్మాతగా, న‌టుడిగా, శ్రీకాంత్‌ తనయుడు హీరోగా తాజాగా విడుద‌లైన మూవీ ‘నిర్మలా కాన్వెంట్‌’. నిర్మ‌లా కాన్వెంట్‌కి జి.నాగేశ్వ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తాజాగా రిలీజైన ఈ సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తోంది.  


తాప్సీ, అమితాబ్‌ల ‘పింక్‌’ విడుద‌ల‌
 
తాప్సీ.. అమితాబ్‌ బచ్చన్‌ ప్రధానపాత్రల్లో తాజాగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన మూవీ ‘పింక్‌’. అమ్మాయిలపై ఎన్నో ఆంక్షలు ఉంటాయి. వాళ్లు తమకు నచ్చినట్టుగా చేస్తే ఎన్నో ఆక్షేపణలు వస్తుంటాయి. వాటికి ఎదురు తిరిగితే సమాజం బరి తెగింపు ముద్ర వేస్తుంది. అమ్మాయిలకు మాత్రం తమకు నచ్చినట్టు చేసే హక్కు లేదా? అనే ఆవేదన నుంచి పుట్టిందే ‘పింక్‌’. ‘పీకూ’ తెరకెక్కించిన శూజిత్‌ సర్కార్ ఈ మూవీని నిర్మించాడు. తాజాగా రిలీజైన ఈ మూవీపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.


ఇంకా టాప్ గేర్‌లోనే 'గ్యారేజ్'


యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమా విడుదలైన ప్రతి సెంట‌ర్ లోను సందడి చేస్తూనే వుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, యుఎస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా తన సత్తా చాటుతోంది. ఒక్క నైజాం లోనే ఈ సినిమా ఇంతరవకూ 17 కోట్ల షేర్ ను రాబట్టింది. ఎన్టీఆర్ కెరియర్లో నైజాంలో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదే. ఒక వైపున దర్శకుడు కొరటాల శివకి .. మరో వైపున ఎన్టీఆర్ కి హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన సినిమాగా ఇది ప్రత్యేకమైన స్థానాన్ని అందుకుంది. 70 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన ఈ సినిమా, నైజాంలోను ఎన్టీఆర్ పేరున ఒక రికార్డును సెట్ చేసి పెట్టింది. 


సిల్వ‌ర్ స్క్రీన్‌పై అన్నాహ‌జారే జీవితం


ప్ర‌ముఖ సామాజికవెత్త అన్నా హజారే జీవితం ఆదారంగా అన్న పేరుతో సినిమా రాబోతోంది. అన్నాహ‌జారే సాధారణ ప్రజలకు తెలియని విషయాలెన్నో ఈ సినిమాలో చూపించబోతున్నారు. శశాంక ఉదాపుర్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తానిషా ముఖర్జీ జర్నలిస్టులో పాత్రలో చేస్తున్నారు. ఇంకా ఇందులో రజిత్ కపూర్, శరత్ సక్సేనా, గోవింద నమడియో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను హిందీతో పాటు ఇంగ్లీష్, ఇతర భారతీయ భాషల్లో అక్టోబర్ 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 


విడాకులు తీసుకున్న స్టార్ డైరైక్టర్-హీరోయిన్ దంపతులు


ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్, ప్రముఖ నటి లిజీ లక్ష్మీలు విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని లిజీ అధికారికంగా ఒక ప్రకటన ద్వారా తెలిపింది. చట్టబద్ధంగా తామిద్దరం విడాకులు తీసుకున్నామని, ఫ్యామిలీ కోర్టులో విడాకుల పత్రాలపై సంతకం చేశామని ప్ర‌క‌టించింది.  1990లో ప్రియదర్శన్-లిజీ పెళ్లి చేసుకున్నారు. చాలాకాలంగా వారి మధ్య వివాదాలున్నాయి. కొంత‌కాలంగా వీరిద్ద‌రు వేర్వేరుగానే ఉంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: