టాలీవుడ్ లో ముదురు హీరోయిన్ గా ముద్రపడ్డ అందాల బొమ్మాళి అనుష్క శెట్టి పెళ్లి చేసుకోబోతుందట. అవును ఇప్పుడి వార్త ఫిలింనగర్ లో కోడై కూస్తోంది. స్వీటీ లవర్ ఎవరో కాదట టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరట. అతడితో ఈ జీరో సైజ్ భామ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోందట. సదరు ప్రొడ్యూసర్ తో అమ్మడు చట్టాపట్టాల్ వేసుకుని తెగ తిరిగేస్తోందట. వీరి ప్రేమలో ట్విస్ట్ ఏంటంటే.. స్వీటీ ప్రేమిస్తున్న నిర్మాతకు గతంలోనే పెళ్లైందట. 


ఓవైపు తెలుగు, తమిళ చిత్రాలకు న్యాయం చేస్తూనే.. తననే నమ్ముకున్న లవర్ కు న్యాయం చేస్తోందట. అతడితో కలిసి ప్రేమలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోందట. త్వరలోనే జేజమ్మ పెళ్లి పీటలు ఎక్కనుందనే వార్తలు ఇప్పుడు అటు ఫిలింనగర్, ఇటు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. వీరి ప్రేమాయణం ఇరు కుటుంబాలకు తెలుసునని అంటున్నాయి.

పదకొండేళ్ల క్రితం సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. మొదట్లో కొన్ని ఇబ్బందులు పడ్డా..తరువాత సక్సెస్ కోసం ఎదురుచూడలేదు. తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి హిట్ లు సాధించింది. అరుంధతిలో తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. అందరి మన్ననలు పొందింది. ఇక గ్లామర్ పాత్ర విషయంలో యోగా టీచర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏ క్యారెక్టరైనా అవలీలగా చేస్తూ.. పాత్రకు ప్రాణం పోసింది. 


ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులోనే కాక కోలీవుడ్ లోనూ భారీ సినిమాల్లో నటిస్తోంది. టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న అనుష్క పెళ్లి కోసం ఎదురు చూసే వాళ్లు చాలా మందే ఉన్నారు. ఫిలింనగర్ వార్తలు వింటుంటే వారి కోరిక తీరే రోజు దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. తీరికలేని షెడ్యూల్స్ లో తలమునకలై ఉన్న రుద్రమదేవి పెళ్లి వచ్చే ఏడాదిలో ఉండొచ్చంటూ  విశ్లేషణలు ప్రారంభమైపోయాయి. చూడాలి మరి 2017లో నైనా స్వీటీ పప్పన్నం పెడుతుందో.. లేదో....


మరింత సమాచారం తెలుసుకోండి: