తెలుగు ఇండస్ట్రీలో   చిరు - మోహన్ బాబు బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ ఇద్దరే.. చిరంజీవి హీరోగా  ఒక్క వెలుగు వెలిగిపోతున్న మోహన్ బాబు అన్ని రకాల పాత్రలు చేస్తూ విలక్షణ నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఇక అల్లుగారు చిత్రం తర్వాత విలన్ గా ఏ సినిమాల్లో నటించలేదు మోహన్ బాబు. టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన నటనలోనే కాదు, తన ప్రవర్తన విషయంలో కూడా చాలా విలక్షణంగా ఉంటాడు. అప్పట్లో మోహన్ బాబు ఓ  దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు చిరంజీవికి మధ్య ఉన్న స్నేహబంధం సీక్రెట్ చెప్పాడు.
Image result for mohan babu chiranjeevi
తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి స్నేహితులమని అయితే తెలుగు సినిమా కొంత మంది గిట్టని వారు తమ మద్య ఏవో అభిప్రాయ భేదాలు వచ్చాయని పుకార్లు పుట్టించారు. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించారు. అయితే తానూ ఎప్పుడు చిరంజీవికి చెడు చేయలేదని అలాగే అతను తనకి చెడు చేయలేదని, తమ పక్కన ఉన్న వాళ్ళే చెడు చేయాలనీ ప్రయత్నించారని దానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారని అన్నారు.  ఇక మోహన్ బాబు నటుడిగా 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని  టి. సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలోని 'లలిత కళా పరిషత్' మోహన్ బాబుకి 'నవరస నట తిలకం' పురస్కారాన్ని అందించనుంది.
Image result for mohan babu chiranjeevi
ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న మోహన్ బాబు కోసం చిరంజీవి ప్రస్తుతం ‘ఖైదీ నెం.150’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ తన స్నేహితుడి కోసం షూటింగ్ క్యాన్సల్ చేసి మరీ ఈ వేడుకకు హాజరయ్యారు. చిరంజీవితో పాటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరవుతున్నారు.  అప్పట్లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రం షూటింగ్ సందర్భంగా తీయించుకున్న అపురూప చిత్రం మీకోసం..


మరింత సమాచారం తెలుసుకోండి: