సొట్ట బుగ్గల సుందరి తాప్సీ లైంగిక వేధింపులకు గురైందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. తనపట్ల కొందరు ప్రవర్తించిన తీరును తలచుకుంటే.. ఇప్పటికే భయమేస్తుందంటోంది. ఇండస్ట్రీలో తానెంతో ధైర్యవంతురాలినని చెప్పే తాప్సీ.. తనపై కూడా లైంగిక దాడి జరిగిందని ప్రకటించడం ఇప్పుడు తెలుగు, తమిళ, బీ టౌన్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. 


ఢిల్లీ బ్యూటీ తాప్సి.. ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో అందాల ఆరబోతకే ప్రాధాన్యమిచ్చిన సొట్టబుగ్గల సుందరి.. నటనాపరమైన కేరక్టర్లు ఎంచుకోవడంలో విఫలమైంది. అరాకొర ఛాన్స్ లు వచ్చినా.. తనలోని అభినేత్రిని బయటకు తీసుకురాలేకపోయింది. కేవలం స్కిన్ షోకే ప్రాధాన్యమివ్వడంతో.. అమ్మడు హాట్ ఇమేజ్ ను మాత్రం సంపాదించుకుంది. 


చివరకు సౌత్ లో ఛాన్స్ లన్నీ ఫెడవుట్ కావడంతో.. తాప్సీ బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడ మాత్రం తాప్సీలో ఇంత నటి దాగుందా అనే రేంజ్లో సత్తా చాటుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన పింక్ సినిమాతో.. అమితాబ్ ను మించి నటించిందనే మార్కులు కొట్టేసింది. పింక్ సినిమాలో ఈ భామ అత్యాచారానికి గురైన అమ్మాయిగా నటించింది. సినిమాలోని కేరక్టర్ కు, తన నిజ జీవితానికి చాలా పోలికలు ఉన్నాయని తాప్సీ స్పష్టం చేసింది.


తాను ఢిల్లీలో పెరిగానని తాప్సీ తెలిపింది. తన జీవితంలో జరిగిన సంఘటలను బహిర్గతం చేసింది. ఉత్సవాల సమయంలో జనసమూహం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయాల్లో అబ్బాయిలు, అమ్మాయిలను ఏడిపిస్తుంటారు. తాక కూడని చోట గిల్లుతూ లైంగిక వేధింపులకు పాల్పడతారు. శాడిజం ప్రదర్శిస్తారు. అలాంటి క్లిష్టపరిస్థితులను తాను ఎన్నో ఎదుర్కొన్నానని తాప్సీ చెప్పింది. అబ్బాయిల ద్వంద్వార్ధాల మాటలు, తినేసేల చూసే వారి చూపులను చాలా క్రూరమైనవిగా అభివర్ణించింది. జరిగినవన్నీ తలుచుకుంటుంటే..అప్పట్లో లైంగిక వేధింపులను ఎదురించకుండా తప్పు చేశాననే భావన కలుగుతోందని చెప్పింది. ఇన్ని రోజులు తానెంతో ధైర్యవంతురాలినని చెప్పే తాప్సీ.. ఇప్పుడీ లైంగిక వేధింపుల విషయాన్ని బహిర్గతం చేయడం వెనుక ఆంతర్యమేమిటనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: