తెలుగు ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన పదమూడు సంవత్సరాల సినీ కెరీర్ లో కనీ వినీ ఎరుగని రీతిలో సాధించిన రికార్డులు ‘జనతా గ్యారేజ్’చిత్రంతో చేసి చూపించాడు. అంతే కాదు గత సంవత్సరం ‘టెంపర్’ మంచి విజయం సాధించిన ఎన్టీఆర్ ఈ సంవత్సరం ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో మరో ఘనవిజయం సాధించారు. ఇక హిట్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ చిత్రంతో మరో విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
Image result for janatha garage
ఆ సమయంలో ఈ చిత్రం ఓవర్సీస్ లో ఏం కలెక్షన్లు సాధిస్తుందని అనుకున్నారు. కానీ మరుసటి రోజు నుంచి అంతా రివర్స్ అయ్యింది..సినిమాపై పాజిటీవ్ రావడం కలెక్షన్ల పరంగా ఒక్కసారే దూసుకు వెళ్లడం జరిగింది. దీంతో  ఓవర్సీస్ లో మంచి వసూళ్లు చేస్తుందని అనుకున్నారు..అంతే కాదు మొదటి వారం రోజులు బాగానే కలెక్షన్లు సాధించినా తర్వాత తగ్గుముఖం పట్టింది..కనీసం  2 మిలియన్ డాలర్ల ని కూడా వసూల్ చేయలేకపోయింది . సెప్టెంబర్ 1 న రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ మొత్తం పదహారు రోజులకు గాను $ 1 ,777, 542 మిలియన్ డాలర్లను మాత్రమే వసూల్ చేసింది. 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరడానికి ఇవ్వాలో రేపో సమయం తీసుకోనుంది జనతా గ్యారేజ్.
Image result for janatha garage
ఇక్కడ వంద కోట్ల క్లబ్ లో చేరుతుందని ఇప్పటికే టాక్ వచ్చినా..యుఎస్ లో జనతా గ్యారేజ్ అనుకున్న రేంజ్ లో వసూళ్లు దక్కలేదు అవలీలగా 2 మిలియన్ క్లబ్ లో చేరుతుందని అనకుంటే నత్త నడకతో సాగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ , మోహన్ లాల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఎన్టీఆర్ చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది . 



మరింత సమాచారం తెలుసుకోండి: