తెలుగు ఇండస్ట్రీలోకి రాంగోపాల్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన పూరీ జగన్నాధ్ తర్వాత బద్రి లాంటి సూపర్ హిట్ చిత్రంతో ఒక్కసారే పాపులర్ అయ్యారు. అప్పటి వరకు మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాన్ కి ఈ చిత్రం మంచి విజయాన్ని అందించింది.  2006వ సంవత్సరంలో ఇతను దర్శకత్వం వహించిన ‘పోకిరి’ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. . 2009వ సంవత్సరంలో పూరి జగన్నాద్ కు ఉత్తమ మాటల రచయితగా నేనింతే చిత్రానికి గాను నంది పురస్కారము లభించింది. 


పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో బద్రి, ఇట్లు శ్రావని సుబ్రహ్మణ్యం,ఇడియట్,అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, నేనింతే, బిజినెస్ మాన్, టెంపర్ తదితర చిత్రాలు విజయవంతం అయ్యాయి. 


తెలుగు చిత్రాలతో పాటు హిందీ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలసి బుద్ద హొగ తెర బప్, కన్నడ పవర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ ని సినిమారంగానికి పరిచయం చేస్తూ అప్పులాంటి  అద్భుతమైన చిత్రాలు అందించారు. పూరీ చిన్ననాటి ఫోటో మీకోసం..

మరింత సమాచారం తెలుసుకోండి: