వేడుక‌లా 'ప్రేమమ్' పాటల సందడి 

యంగ్‌హీరో అక్కినేని నాగచైతన్య- శ్రుతి హాసన్ జంటగా నటించిన ‘ప్రేమమ్’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో వేడుక‌లా జ‌రిగింది. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా పాటలను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి హీరో నాగ చైతన్య, హీరోయిన్ శ్రుతిహాస‌న్ తో పాటు నటులు శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, బాలాజీ, నర్రా శీను తదితరులతో పాటు,‘అక్కినేని’ అభిమానులు కూడా హాజరయ్యారు.  ఈ ఆడియో వేడుకలో దర్శకరత్న దాసరి నారాయణరావు, హీరోయిన్లు శ్రుతిహాసన్, మడోనా, సంగీత దర్శకులు గోపి సుందర్, రాజేష్ మురుగేషన్ తదితరులు పాల్గొన్నారు. మలయాళంలో ఈ సినిమాకి రాజేష్ మురుగన్ సంగీతాన్ని అందించాడు. ఆయన స్వరపరచిన నాలుగు ట్యూన్స్ ను అలాగే వుంచి, మిగతా మూడు పాటలకి గోపీసుందర్ సంగీతాన్ని అందించాడు.


చైతూ నవ్వుతూనే ఒక హీరోయిన్ ని పడేశాడు: దాసరి 


నాగ‌చైత‌న్య‌ నవ్వుతూనే ఒక హీరోయిన్ ని పడేశాడని దర్శక రత్న దాసరి నారాయణరావు అన్నారు. ‘ప్రేమమ్’ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న దాసరి ఈ సందర్భంగా మాట్లాడుతూ..,‘అక్కినేని నాగేశ్వరరావుగారికి నాకు యాభై సంవత్సరాల పరిచయం. ఆయనతో ఎన్నో హిట్ చిత్రాలు తీశాను. అవన్నీ ప్రేమ కథా చిత్రాలే. నాగేశ్వరరావు ప్రేమకథా చిత్రాల వారసత్వాన్ని నాగార్జున కొనసాగించాడు. దానిని చైతన్య, అఖిల్ పునరావృతం చేస్తున్నారు. నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో ‘ప్రేమమ్’ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని దాసరి నారాయణరావు అన్నారు. అనంతరం ‘ప్రేమమ్’ చిత్రం ఆడియో సీడీని ఆవిష్కరించారు.


నా గడ్డం బాగుందా.. చైతూ గడ్డం బాగుందా?: నాగార్జున


‘ప్రేమమ్’ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమంలో  నాగార్జున మాట్లాడుతూ, ‘మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమా సూపర్ హిట్ అయింది. ‘ప్రేమమ్’ అంటే అర్థం ఏంటో ఈ మధ్యనే నేను తెలుసుకున్నాను. సంస్కృతంలో ప్రేమమ్ అంటే ప్రేమ అని అర్థం. సరే.. ఈ సీరియస్ టాక్ మానేసి.. నా గడ్డం బాగుందా? చైతన్య గడ్డం బాగుందా? యాక్చువల్ గా ఈ సినిమా కోసం చైతన్య గడ్డం పెంచినపుడు, ఈ గడ్డం బాగుంది, నేను కూడా ‘ఓం నమో వెంకటేశాయ’కు పెంచితే బాగుంటుందని నాకు అన్పించింది. నేను గడ్డం పెంచిన తర్వాత నా గడ్డమే బాగుందని వాడన్నాడు. నాన్నగారి ‘దేవదాసు’, ‘ప్రేమాభిషేకం’, నా ‘గీతాంజలి’ వరకు ప్రేమ కథా చిత్రాలను అభిమానులందరూ ఎంతగానో ఆదరించారు. ఆ చిత్రాలకు సరిపోయే ప్రేమ కథ ‘ప్రేమమ్’. మలయాళంలో ఈ చిత్రం ఎంత సూపర్ హిట్ అయిందో అంతే హిట్ ఇక్కడ కూడా అవుతుందని ఆశిస్తున్నాను. నేను వెంటనే వెళ్లిపోతున్నాను. ఎందుకంటే, ఈరోజు నాన్నగారి జయంతి. నాన్నగారి ఫంక్షన్లలో పాల్గొనాలి. అలాగే, ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రం షూటింగ్ రేపు ఉంది. దీనికి సంబంధించి పెద్దపెద్ద డైలాగ్ లు ఇచ్చారు.. ఇంటికి వెళ్లి నేర్చుకోవాలి’ అని నాగార్జున అన్నారు.


ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ‘జనతా గ్యారేజ్’కు స్థానం


ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జనతా గ్యారేజ్’ సక్సెస్ ఫుల్ గా నడుస్తూ రికార్డ్ కలెక్షన్లను కొల్లగొడుతోంది. రిలీజ్ డే రోజున మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తరువాత చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం మెగా సినిమాలైన ‘మగధీర, అత్తారింటికి దారేది’ లను దాటుకుని టాలీవుడ్ ఆల్ టైమ్ హిట్స్ లో 3వ స్థానం దక్కించుకుంది. ఇకపోతే ఈ వారాంతం కూడా సినిమాకి మంచి ఆదరణ దక్కింది. దాదాపు అన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు 85 శాతం వరకూ నిండాయి. ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే ఇంకొద్ది రోజుల్లో ఈ చిత్రం రెండవ స్థానంలో ఉన్న మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ని కూడా క్రాస్ చేసే అవకాశముంది.


‘రోబో 2’ కోసం రజనీకాంత్ రెడీ


సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్ ల కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న మూవీ ‘రోబో 2.0’. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘రోబో’కు ఈ చిత్రం సీక్వెల్ గా తెరకెక్కుతోంది. భారతీయ సినీ రంగంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే 70 శాతం వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక మిగిలిన షూటింగ్ లో ఎక్కువ భాగం రజనీ మీదే షూట్ చేయాల్సి ఉంది. ‘కబాలి’ తరువాత పూర్తిగా రెస్ట్ టీయూస్కుంటున్న రజనీ సెప్టెంబర్ 23 నుంచి చెన్నైలో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్లో రజనీ, అక్షయ్ కుమార్, యామీ జాక్సన్ ల మీద కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉండనుంది. అలాగే ఈ చివరి దశ షూటింగ్ ను ఈ షెడ్యూల్లోనే ముగించాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇక ఈ సినిమాను వ‌చ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


వేలానికి 'గబ్బర్ సింగ్' పోలీస్ డ్రెస్


హైదరాబాద్ లో స‌మంత నిర్వహిస్తోన్న 'ప్రత్యుష' ఫౌండేషన్ కోసం సమంతా ప‌లు వ‌స్తువుల‌ను వేలం వేయ‌డం తెలిసిందే. తాజాగా సినిమాల్లో హీరోయిన్ ఉపయోగించిన దుస్తులను, సమంతా ఆన్ లైన్ లో వేలానికి పెడుతోంది. అలా 'గబ్బర్ సింగ్'లో పవన్ కల్యాణ్ ఉపయోగించిన పోలీస్ డ్రెస్ ను ఆమె అమ్మకానికి ఉంచుతోంది. ఇందు కోసమే 'దూకుడు' సినిమాలో మహేశ్ ఉపయోగించిన దుస్తులను కూడా ఆమె సేకరించినట్టు తెలుస్తోంది. సామాజిక సేవ కోసం సమంతా ఇలా నిధులను సేకరిస్తూ ఉండటం పట్ల అంతా అభినందనలు తెలియజేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: