ఉత్తర, దక్షిణాది సినీ పరిశ్రమలో ఒక కథానాయిక గ రాణించాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆశా మాషీ కాదు. కేవలం నటన వస్తే పురుషులకు సినిమాల్లో అవకాశాలు సులువుగా లభిస్తున్నా, మహిళలు మాత్రం నానా తిప్పలు పడాల్సివస్తోంది. ఇప్పుడు అగ్ర కథానాయికలుగా రాణిస్తున్న వారంతా మొదట్లో సినీ పరిశ్రమల్లోకి అరంగేట్రం చేయడానికి నానా యాతలకు గురికావాల్సి వచ్చిందని వారు మీడియా ముందు నాటి పరిస్థితులను వెల్లడిస్తున్నారు. 



సహజంగా కథానాయకులకు తప్పని పరిస్థితి ఇది. ఒక్క అవకాశం కోసం సర్వస్వం సైతం దారపోసినా అవకాశాలు మాత్రం దక్కట్లేదు. ఒక వేల దక్కినా అవి నిలబడట్లేదు. నటిగా కెరీర్‌ ప్రారంభించిన తొలినాళ్లలో తాను సినిమా కష్టాలు ఎదుర్కొన్నానంటూ చెప్పుకొచ్చింది ఈ ‘కబాలి’ సుందరి. సాంఘిక దురాచారాలపై అమ్మాయిల పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ‘పార్చ్‌డ్‌’లో రాధికా నటించారు. వాస్తవికతకు అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 


Image result for radhika apte

ఈ సందర్భంగా ఓ ఆంగ్ల సినీ వెబ్‌సైట్‌తో ఆమె మాట్లాడుతూ.. ‘నా తొలినాళ్లలో అందరిలానే నాకూ సినిమా కష్టాలు తప్పలేదు. అయితే అవకాశం కోసం ఎప్పుడూ నేను అడ్డదారి మాత్రం తొక్కలేదు. ఎప్పుడో ఓసారి ఓ నటుడు... దక్షిణాదికి చెందిన వాడనుకుంటా, ఫోన్‌ చేసి నన్ను తన గదికి రమ్మని పిలిచారు. అంతేకాకుండా తన చపలబుద్ధిని ప్రదర్శిస్తూ మాట్లాడారు. నాకు ఒక్కసారిగా కోపం నషాళానికి అంటింది. 


Image result for radhika apte

ఆ వ్యక్తిని అప్పుడే దుమ్ముదులిపేశా..’ అంటూ చెప్పుకొచ్చింది రాధికా. లీనా యాదవ్‌ దర్శకత్వంలో రాధికా ఆప్టే, తన్షిత ఛటర్జీ, సుర్విన్‌ చావ్లా, అదితి గుప్తా, అదిల్‌ హుస్సేన్‌ ప్రధాన పాత్రల్లో ‘పార్చ్‌డ్‌’ రూపొందించారు. అజయ్‌ దేవగణ్‌ నిర్మించారు. ఇప్పటికే ఏడు దేశాల్లో విడుదలైన ఈ చిత్రం వివిధ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై 18 పురస్కారాలు దక్కించుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: