టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని వారింటికి కాబోయే కోడలు.. సమంత రెండు సార్లు పెళ్లికి సిద్ధమవుతుందా? అంటే సినీ 
వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. సమంత, అక్కినేని నాగ చైతన్య ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ ప్రేమ జంటకు పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో.. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ భార్యా, భర్తలు కాబోతున్నారు. 


నాగ చైతన్య, సమంత పెళ్లి వెళ్లి విషయాన్ని అక్కినేని నాగార్జున ధృవీకరించగా.. కొద్ది రోజుల క్రితం నాగ చైతన్య ఏకంగా వచ్చే ఏడాది మా పెళ్లంటూ క్లారిటీ ఇచ్చేశాడు. పెద్దలు పెళ్లికి అంగీకరించినా.. చైతూ, సమంతల పెళ్లికి కొన్ని ఆటంకలు 
కలుగుతున్నాయట. అవేంటంటే.. నాగార్జున కుటుంబం హిందువులు కాగా.. సమంతది క్రిస్టియన్ ఫ్యామిలి. ఇరువురిది వేర్వేరు మత సాంప్రదాయాలు కావడంతో.. ఏ మతం ప్రకారం వివాహం జరిపించాలన్నదిపై రెండు కుటుంబాలు మల్లగుల్లాలు పడుతున్నారట. 
 
నాగ చైతన్య, సమంత వారి వారి సాంప్రదాయాల ప్రకారం వివాహం జరిపించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో.. రెండు కుటుంబాల్లో అయోమయం నెలకొందని సినీ వర్గాల సమాచారం. సమస్యకు పరిష్కారం చూపాలంటే.. ఇరు మతాలను గౌరవిస్తూ.. రెండు సార్లు నాగచైతన్య, సమంతల పెళ్లి నిర్వహిస్తే బావుటుందన్న బంధుమిత్రుల సలహాలను పాటించేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. ముందుగా హిందూ సంప్రదాయం ప్రకారం హైదరాబాద్ లో ఓసారి, తరువాత చెన్నైలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం రెండోసారి నిర్వహించనున్నట్లు వినికిడి. 


మరింత సమాచారం తెలుసుకోండి: